Begin typing your search above and press return to search.
ఏపీలో రీపోలింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడెక్కడంటే?
By: Tupaki Desk | 2 May 2019 5:02 AM GMTఏపీలో రీపోలింగ్ కు డేట్ ఇచ్చేశారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల దృష్ట్యా రీపోలింగ్ అనివార్యంగా మారింది. మరికొన్నిచోట్ల ఈవీఎంలలో చోటు చేసుకున్న సాంకేతిక సమస్యల దృష్ట్యా రీపోలింగ్ చేపట్టాలని డిసైడ్ చేశారు.
తాజాగా వెల్లడించిన దాని ప్రకారం ఏపీలోని మొత్తం 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 6న రీపోలింగ్ చేపట్టాలని ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు. రీపోలింగ్ నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే.. గుంటూరు జిల్లా నరసరావుపేట.. గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్.. నెల్లూరు జిల్లా నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం.. ఇదే జిల్లాకు చెందిన సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు.
మొత్తం 5 చోట్ల జరిగే రీపోలింగ్ నాలుగు జిల్లాల పరిధిలో జరగనుంది. రీపోలింగ్ నిర్వహించేది.. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క బూత్ లో మాత్రమే.
రీపోలింగ్ జరిగే 5 పోలింగ్ బూత్ లు ఏవంటే?
+ నరసరావుపేట నియోజకవర్గం కేసరపల్లిలో 94వ నంబర్ పోలింగ్ బూత్
+ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244వ నంబర్ పోలింగ్ కేంద్రం
+ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోవూరు మండలం పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్ బూత్
+ సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ పోలింగ్ సెంటర్
+ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోనియర్రగొండపాలెం మండలం కలనూతలలో 247వ పోలింగ్ బూత్