Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌: చంద్ర‌గిరిలో మ‌రో 2 చోట్ల రీపోలింగ్‌!

By:  Tupaki Desk   |   18 May 2019 10:37 AM GMT
బ్రేకింగ్‌:  చంద్ర‌గిరిలో మ‌రో 2 చోట్ల రీపోలింగ్‌!
X
మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఏపీ విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వేరుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. విప‌క్షాల‌కు మేలు క‌లిగేలా నిర్ణ‌యం తీసుకున్నట్లుగా ఏపీ అధికార‌ప‌క్షం ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌రుగుతున్న ఐదు పోలింగ్ స్టేష‌న్ రీపోలింగ్ కు మ‌రో రెండు చోట్ల పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌టం తెలిసిందే. వారి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. చంద్ర‌గిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మ‌ళ్లీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అండ్ కో తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అప్పుడెప్పుడో ఏప్రిల్ 11న పోలింగ్ జ‌రిగితే.. 34 రోజుల త‌ర్వాత కంప్లైంట్ ఇవ్వటం.. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ.. ఈసీ నిర్ణ‌యం తీసుకోవ‌టం ఏమిటి? అంటూ తెలుగు త‌మ్ముళ్లు మండిప‌డుతున్నారు.ఇదిలా ఉంటే.. రీపోలింగ్ కు మ‌రికొద్ది గంట‌ల స‌మ‌యం ఉండ‌గా.. మ‌రో సంచ‌ల‌నానికి తెర తీసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

చంద్ర‌గిరి నిర్వ‌హిస్తున్న రీపోలింగ్ ను మొద‌ట అనుకున్న‌ట్లు ఐదు పోలింగ్ స్టేష‌న్ల‌లో కాకుండా.. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

తొలుత ప్ర‌క‌టించిన రీపోలింగ్ పోలింగ్ స్టేష‌న్లు..

1. ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి
2. పులవర్తివారిపల్లి
3. కొత్తకండ్రిగ
4. కమ్మపల్లి
5. వెంకటరామాపురం

తాజాగా రీపోలింగ్ కు తీసుకున్న ఈ రెండు పోలింగ్ పోలీస్ స్టేష‌న్లు

1. క‌ప్పం బాదూరు
2. కాలూరు