Begin typing your search above and press return to search.

షాకింగ్ నిజాన్ని చెప్పిన రిపోర్టు.. దేశంలో 82% భర్తతో సెక్సుకు నో

By:  Tupaki Desk   |   11 May 2022 3:17 AM GMT
షాకింగ్ నిజాన్ని చెప్పిన రిపోర్టు.. దేశంలో 82% భర్తతో సెక్సుకు నో
X
చదివినంతనే నమ్మలేని రీతిలో ఉన్న ఒక రిపోర్టు బయటకు వచ్చింది. ప్రభుత్వ ఆరోగ్య శాఖ నిర్వహించిన హెల్త్ సర్వేలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చినట్లుగా పేర్కొంటున్నారు. పెళ్లైన కొత్తల్లో సెక్సు పట్ల ఉండే ఆసక్తి ఆ తర్వాత ఉండకపోవటం.. భర్తకు ఆ ఉద్దేశం ఉన్నా భార్య మాత్రం దానిపై అంతగా ఆసక్తి చూపని వైనం దేశంలో ఎక్కువగా ఉండటమే కాదు.. నమ్మలేనంత రీతిలో ఉన్నట్లుగా ఆరోగ్య శాఖ నిర్వహించిన హెల్త్ సర్వే5లో వెల్లడైనట్లు చెబుతున్నారు.

దేశంలో 82 శాతం భర్తలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఐదుగురు మహిళల్లో నలుగురు భర్తతో లైంగిక సంబంధం ఇష్టం లేనిపక్షంలో ముఖం మీదనే నో చెప్పేస్తారట.

దేశంలోని మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా లక్షదీప్ లో అత్యధికంగా 94.2 శాతం మంది.. గోవాలో 92 శాతం మహిళలు భర్తకు నో చెప్పేస్తారని పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే.. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీలో తక్కువగా.. తెలంగాణలో ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఏపీలో 79.3 శాతం మంది భర్తలకు నో చెప్పేలా ఉంటే.. తెలంగాణలో ఏకంగా 84.9 శాతం మంది తమ భర్తకు నో చెబుతారని పేర్కొన్నారు. అదే సమయంలో అతి తక్కువగా అరుణాచల్ ప్రదేశ్ లో 63 శాతం మంది.. జమ్మూకశ్మీర్ లో 65 శాతం మంది మాత్రమే భర్తకు నో చెబుతారని పేర్కొన్నారు. అంటే.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రాల్లోని భార్యలు భర్తతో సెక్సుకు నో చెప్పే దైర్యం చేయరన్న మాట.

నిజానికి ఈ సర్వే నివేదికను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య గత వారం విడుదల చేశారు. దీనికి సంబంధించిన అధ్యయనం మాత్రం జూన్ 2019 నుంచి జనవరి 2020 వరకు 17 రాష్ట్రాలు.. ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించారు.

2020 జనవరి నుంచి 2020 ఏప్రిల్ వరకు రెండో దశను చేపట్టారు. మొత్తానికి భర్తకు మూడ్ వచ్చి సెక్సు అన్నంతనే తమ ఇష్టంతో పని లేకుండా శరీరాన్ని అప్పగించే విషయంలో భార్యలు తమ స్వేచ్చను ప్రదర్శిస్తున్న వైనం తాజా అధ్యయనం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.