Begin typing your search above and press return to search.
మునుగోడు ఫలితంపై కేసీఆర్ కు పంపిన నివేదికలో ఏముంది?
By: Tupaki Desk | 5 Nov 2022 7:33 AM GMTసమకాలీన రాజకీయ భారతంలో జరిగిన ఉప ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి.. పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్నిక ఏదైనా ఉందంటే అది ఇటీవల ముగిసిన మునుగోడు ఉప ఎన్నికగా చెప్పాలి. ఈ ఎన్నిక పోలింగ్ కు ముందు నుంచి భారీగా అంచనాలు వ్యక్తమయ్యాయి. అవసరమైతే ఓటర్లకు అభ్యర్థులు తులం బంగారం ఇచ్చేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం పెను సంచలనంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా వినిపించినట్లుగా తులం బంగారం ఓటర్లకు దక్కింది లేదు కానీ.. కొన్ని పెద్ద కుటుంబాలకు మాత్రం తులం బంగారానికి కాస్త అటు ఇటుగా డబ్బులు అందిన వైనం చూశాక.. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎంత ఖరీదైనవిగా మారతాయన్న విషయాన్ని మునుగోడు స్పష్టం చేసిందంటున్నారు. ఇక.. మునుగోడు ఫలితం ఎలా ఉంటుందన్న విషయంపై ఇప్పటికే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చేసి.. వాటిని వెల్లడించటం తెలిసిందే.
వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో ఒక్కటి తప్పించి మిగిలిన వారంతా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. నలబై శాతానికి పైగా ఓట్లు కారు గుర్తుకు నమోదైనట్లుగా తేల్చారు. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం కూర్చొని పోలింగ్ మరుసటి రోజున.. బూత్ లెవల్ లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి? మరెన్ని ఓట్లు టీఆర్ఎస్ కు పడ్డాయి? అన్న దానిపై లెక్కలు తీశారు. టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలకు వచ్చే ఓట్ల లెక్కను కూడా మదించినట్లుగా తెలుస్తోంది.
మంత్రి జగదీశ్ రెడ్డి.. పార్టీ నల్గొండ జిల్లా ఇన్ ఛార్జి కమ్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావుతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు కమ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ లు కలిసి నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. మంత్రి కేటీఆర్ లకు అందజశారు. ఈ నివేదికలో పేర్కొన్న సమాచారం ప్రకారం పోలైన ఓట్లలో యాబై శాతం ఓట్లు టీఆర్ఎస్ కు పడినట్లుగా పేర్కొన్నారు.
వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్.. అదే సమయంలో పార్టీ అంతర్గతంగా సిద్ధం చేసిన పోలింగ్ సరళికి సంబంధించిన రిపోర్టుల్ని చూసుకొని కేసీఆర్ సంతృప్తి చెందినట్లుగా చెబుతున్నారు.
ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి పార్టీ తరఫున నియమించాల్సిన ఏజెంట్ల జాబితాను సిద్ధం చేశారు. భారీ ఎత్తున ప్లాన్ చేసి.. వ్యూహాత్మకంగా ప్రచారాన్ని నిర్వహించి.. పోటాపోటీ పరిస్థితుల్లో ఘన విజయంసాధించటం ఖాయమన్న విషయాన్ని నివేదికలో స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. సో.. సంబరాలకు సిద్ధమవుతున్నట్లే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.