Begin typing your search above and press return to search.

మ‌రో స‌ర్వే - జ‌గ‌నే హీరో!

By:  Tupaki Desk   |   2 Nov 2018 6:59 AM GMT
మ‌రో స‌ర్వే - జ‌గ‌నే హీరో!
X
ప్ర‌ఖ్యాత జ‌ర్న‌లిస్ట్ అర్న‌బ్ గోస్వామి సార‌థ్యంలోని రిప‌బ్లిక్ టీవీ దేశ‌వ్యాప్తంగా నెల‌కొన్న రాజ‌కీయ పోక‌డ‌ల గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగితే, ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయ‌నే అంశాన్ని పేర్కొంటూ త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే ప్ర‌కారం ఏపీలో 41.3 ఓట్ల శాతం వైసీపీకి ద‌క్కుతుండ‌గా, అధికారంలో ఉన్న టీడీపీకి 31.2 శాతం ఓట్లు మాత్ర‌మే సొంతం కానున్నాయ‌ని వెల్ల‌డించింది. తెలంగాణ‌లో అధికారం మ‌రోమారు కేసీఆర్‌దేన‌ని వెల్ల‌డించింది. అయితే, గ‌తం కంటే ఓట్ల శాతం త‌గ్గి 31 శాతానికి చేరుతుంద‌ని పేర్కొంది.

వ‌చ్చే ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌నున్న నేప‌థ్యంలో రిప‌బ్లిక్‌ టీవీ ఈ స‌ర్వే చేసింది. దీని ప్ర‌కారం తెలంగాణ‌లో అధికారం గులాబీ పార్టీదేన‌ని తేలింది. ప్ర‌తిపక్షాలు బ‌ల‌ప‌డ‌టం, మ‌హాకూట‌మి రూపంలో జ‌ట్టుక‌ట్ట‌డం వంటి కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న నేప‌థ్యంలో టీఆర్ ఎస్ సొంతం చేసుకునే ఓట్ల శాతం గ‌తం కంటే త‌గ్గిపోనుంద‌ని పేర్కొంది. ఏపీ విష‌యానికి వ‌స్తే జ‌గ‌న్‌ దే పైచేయి అని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని పేర్కొన్న ఈ స‌ర్వేలో టీడీపీ-బీజేపీ న‌ష్ట‌పోతుంద‌నే విష‌యం ప్ర‌జ‌లు వెల్ల‌డించిన‌ట్లు పేర్కొంది. బీజేపీకి ప్ర‌స్తుతం ఉన్న సీట్లు కూడా ద‌క్క‌వ‌ని ప్ర‌స్తావించింది. గ‌తంలో గెలిచిన రెండు ఎంపీ స్థానాల‌ను కూడా బీజ‌పీ కోల్పోతుంద‌ని తెలిపింది. 2014లో 15 సీట్లు గెలుచుకున్న టీడీపీ రాబోయే ఎన్నిక‌ల్లో కేవ‌లం 5 స్థానాల‌కే ప‌రిమితం కానుంద‌ని రిప‌బ్లిక్ టీవీ స‌ర్వేలో తేలింది. గ‌త ఎన్నిక‌ల్లో 8 సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగితే 20 స్థానాలు కైవ‌సం చేసుకుంటుంద‌ని వెల్ల‌డించింది. ఇక ప్ర‌ధాన పార్టీల్లో ఒక‌టైన‌ కాంగ్రెస్ ఒక్క సీటును కూడా కైవ‌సం చేసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే, రిప‌బ్లిక్ టీవీ ప్ర‌స్తుత ప‌రిస్థితులను ప్ర‌జ‌ల ద్వారా తెలుసుకొని నిర్వ‌హించిన స‌ర్వే ఇది. ఈ త‌రుణంలో తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిల‌కు సైతం మ‌రో నెల స‌మ‌యం ఉంది. అదే స‌మ‌యంలో సార్వ‌త్రిక పోరుకు దాదాపుగా ఆరునెల‌ల గ‌డువు ఉన్న నేప‌థ్యంలో ఈ స‌ర్వే ఆనాటి కాల‌మాన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్ర‌తిబింబిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.