Begin typing your search above and press return to search.
5 ఏళ్ల తరవాత రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం !
By: Tupaki Desk | 20 Dec 2019 7:22 AM GMTరిపబ్లిక్ డే సందర్భం గా వచ్చే నెల అనగా ..2020 జనవరి 26న ఢిల్లీలోని రాజ్‌పథ్ లో జరిగే పరేడ్ కు తెలంగాణ రాష్ట్ర శకటం ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఇలా శకటాన్ని రాజ్‌పథ్ లో జరిగే పరేడ్ లో ప్రదర్శిండం ఇది రెండోసారి. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రతిబింబించే ఈ శకటంపై వేయి స్తంభాల గుడి, బతుకమ్మ వైభవం కూడా కొలువుదీరనున్నాయి. పరేడ్లో మేడారం జాతర రూపకాన్ని కళాకారులు ప్రదర్శించనున్నారు.
ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్ లో అన్ని రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని శకటాలపై ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ నేపథ్యంలోనే 2015లో తెలంగాణ రాష్ట్రానికి అవకాశం లభించింది. తొలిసారిగా తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న ‘బోనాలు’ రూపకాన్ని తెలంగాణ కళాకారులు ప్రదర్శించారు. ఆ తర్వాత బతుకమ్మ, మేడారం జాతర ఆకృతితో శకటాల నమూనాలు పంపించినప్పటికీ ఎంపిక కాలేదు.
తాజాగా, ఇప్పుడు మేడారం జాతర, బతుకమ్మ, వేయి స్తంభాల గుడి ఆకృతిలో రూపొందించిన శకటం అన్ని రాష్ట్రాల శకటాలతో పాటు ప్రదర్శనకు ఎంపిక కావడంతో హర్షం వ్యక్తమవుతోంది. శకటం నమూనాను ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ గురువారం మీడియాకు విడుదల చేశారు. మళ్లీ 5 ఏళ్ల తరవాత తెలంగాణా శకటం ఆర్డీపీలో పాల్గొనబోతుంది.