Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ డే విశిష్టత .. ఆలా జరగడం 72 ఏళ్ల చరిత్ర లో నాలుగోసారి మాత్రమే !

By:  Tupaki Desk   |   26 Jan 2021 5:30 AM GMT
రిపబ్లిక్ డే విశిష్టత .. ఆలా జరగడం 72 ఏళ్ల చరిత్ర లో నాలుగోసారి మాత్రమే !
X
భారతదేశం అంటేనే రకరకాల కళలు, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు, భాషల సమ్మేళనం. వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు, నాటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకున్నారు. దేశంలోని అనైక్యతను ఆసరగా చేసుకుని క్రమంగా పట్టుసాధించారు. రాజ్యాలు, సంస్థాలుగా ఉన్న భారతావనిని, విభజించు పాలించు విధానం అవలంభించిన బ్రిటిషర్లు.. అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలు పాటు ఆంగ్లేయులు పాలనలో ఉన్న భరతమాతకు, సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారు. అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన గాంధీ జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అయితే, 1947 ఆగస్టు 15న స్వాతంత్ర వచ్చినా, 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది.

ఇక, తొలి రిపబ్లిక్‌ వేడుకలు 1950 లో ఇప్పుడు జరుగుతున్నట్లే రాజ్‌పథ్‌లోనే జరిగాయి. ఆ ఏడాది రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ ఓపెన్‌ టాప్‌ గుర్రాల బగ్గీలో కూర్చొని రాష్ట్రపతి భవన్‌ నుంచి పరేడ్‌ గ్రౌడ్స్‌ కి బయల్దేరారు. పరేడ్‌ ను చూడ్డానికి వచ్చిన వారందరికీ ప్రభుత్వం స్వీట్లు పంచిపెట్టింది. తర్వాతి పరేడ్ ‌లు వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఎర్రకోటలో ఒకసారి, ఇర్విన్‌ స్టేడియంలో ఒకసారి, రామ్‌ లీలా మైదానంలో ఒకసారి.. ఇలా. 1955 నుంచి మాత్రం రాజ్‌ పథ్‌ లోనే రిపబ్లిక్‌ డేవేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఇండియా ఆవిర్భవించాక ఇంతవరకు మూడుసార్లు మాత్రమే ముఖ్య అతిథి లేకుండా రిపబ్లిక్‌ డే జరిగింది. ఈ ఏడాది కూడా ముఖ్య అతిధి లేకుండానే వేడుకలు జరుగుతున్నాయి.

1952లో, 1953లో, 1966లో అతిథి లేకుండా మన రిపబ్లిక్‌ డే పరేడ్‌లు జరిగాయి. 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే అతిథి లేకుండా మన రిపబ్లిక్‌ పరేడ్‌ జరుగుతుంది. ఈ వేడుకలకి అతిధులని పిలవడానికి రాజనీతి వ్యూహాలు ఉంటాయి. బ్రిటన్‌ ప్రధానినే ఈసారి ఎందుకు ఆహ్వానించారు అంటే దాని వెనుక కూడా ఓ కారణం ఉంది. బ్రిటన్‌ ఐరోపా సమాఖ్య నుంచి అధికారికంగా బయటికి వచ్చేసి ఉంది. ఇండియా ఆర్‌.సి.ఇ.పి. లోకి వెళ్లేందుకు సంశయిస్తోంది. ఆర్‌.సి.ఇ.పి. మీద ఇప్పటికే ఆసియాదేశాలు చాలావరకు సంతకాలు చేసేశాయి. బ్రిటన్ ‌కి, ఇండియాకు గ్రూప్‌ లో ఒకరిగా ఉండటం ఇష్టం లేదు. అందుకే బ్రిటన్‌ బయటికి వచ్చేస్తే, ఇండియా లోపలికి వెళ్లడం లేదు. ఈ సమయంలో లండన్, ఢిల్లీ ఒకటిగా ఉంటే.. వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో ఏ ప్రయోజనాలైతే కలిసి సాధిస్తామని ఆ గ్రూపులు అంటున్నాయో వాటినే ఈ రెండు దేశాలూ కలిసి వేరుగా సాధించుకోవచ్చు. అందుకు ఒక సోపానం గౌరవ ఆతిథ్యం కూడా.

ఇక ప్రతి సంవత్సరమూ జరిగేంత ఆర్భాటంగా కాకున్నా, 72వ భారత గణతంత్ర వేడుకలు న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో సైనిక పాటవాన్ని చాటుతూ ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు.ఆ తరువాత వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఫ్రాన్స్ నుంచి గత సంవత్సరం ఇండియా దిగుమతి చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు తొలిసారిగా గణతంత్ర పరేడ్ లో పాల్గొన్నాయి. ఇవి చేసిన వర్టికల్ చార్లీ విన్యాసాలను అతిథులు చప్పట్లతో స్వాగతిస్తూ తిలకించారు.