Begin typing your search above and press return to search.

ట్రంప్ ను అఫీషియల్ గా డిక్లేర్ చేశారు

By:  Tupaki Desk   |   21 July 2016 4:55 AM GMT
ట్రంప్ ను అఫీషియల్ గా డిక్లేర్ చేశారు
X
కంపు మాటల కింగ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి అధికారికంగా వచ్చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని రిపబ్లికన్ పార్టీ ఓకే చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. గడిచిన 13 నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తోటి రిపబ్లికన్ ఆశావాహ అభ్యర్థులపై విజయం సాధించిన ఆయన్ను తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ ర్యాన్ అధికారికంగా డిక్లేర్ చేశారు.

‘‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’’ అన్న నినాదంతో ఏడాది కిందట పార్టీలో చేరిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే వరకూ వెళ్లటం మామూలు విషయం కాదనే చెప్పాలి. మొనగాళ్లు లాంటి నేతల్ని తన కంపు మాటలతో వచ్చిన పాపులారిటీతో ఓడగొట్టేసిన అతగాడు తాజాగా పార్టీ అధికారిక అధ్యక్ష అభ్యర్థిగా మారారు. ఇక.. ట్రంప్ తో కలిసి పని చేసే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఇండియానా గవర్నర్ మైక్ ఫెన్స్ ను నామినేట్ చేశారు. ట్రంప్ పై ఉన్న విమర్శల నేపథ్యంలో అతడి అభ్యర్థిత్వంపై రిపబ్లికన్లు పెద్ద ఎత్తున కిందామీదా పడ్డారు. ప్రైమరీల్లో అతడికి వచ్చిన ఓట్లను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారాలపై ట్రంప్ ఆగ్రహం కావటం.. ట్రంప్ మినహా మరెవరినీ ఎన్నికల బరిలోకి దింపలేని దైన్యంలో రిపబ్లికన్ల తాజా అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ అవతరించారు. అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా మారిన ట్రంప్ నోటి నుంచి రానున్న రోజుల్లో మరెన్ని కంపు మాటలు వస్తాయో చూడాలి.