Begin typing your search above and press return to search.
ఆ ఒక్క మాటతో ఏకాకి అయిపోతున్న ట్రంప్
By: Tupaki Desk | 20 May 2017 4:39 AM GMTఅమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన సన్నిహతులే దూరం అవుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని రష్యాతో పంచుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో అమెరికన్ కాంగ్రెస్ లోని కొంతమంది రిపబ్లికన్ సభ్యులు ట్రంప్ కు దూరంగా ఉంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి. మరికొంతమంది సభ్యులు కూడా వారి బాటలోనే పయనించే అవకాశం ఉందని సంకేతాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి కొంతమంది రిపబ్లికన్ ఎంపీలు ఈ విషయంపై మరికొంత నిశితంగా అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యవహార శైలిపై అనేక వ్యాఖ్యలు, విమర్శలు వస్తున్నాయి.
వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో సున్నితమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రి లావ్ రోవ్ తో ట్రంప్ పంచుకున్నారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఈ వార్తపై కలకలం రేకెత్తిన సంగతి తెలిసిందే. ఈ కథనాలపై ట్వీట్ లో స్పందించిన ట్రంప్ ‘వైట్ హౌస్ లో జరిగిన బహిరంగ సమావేశంలోనే ఈ వివరాలను రష్యాతో పంచుకోవాలని దేశాధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు నాకు పరిపూర్ణమైన అధికారం ఉంది. దీని వెనుక మానవీయ దృక్కోణం కూడా ఉంది. ఉగ్రవాదం, విమానయాన భద్రత వివరాలను రష్యాకు తెలియజేయడం వల్ల ఆ దేశం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది’అని పేర్కొన్నారు. అయితే ట్రంప్ దూకుడు సమాధానంపై సొంత పార్టీలోనే అసంతృప్తి రాజుకున్నట్లు సమాచారం.
కాగా ఇతర దేశాలతో ఇంటెలిజెన్స్ సమాచారాన్ని వైట్ హౌస్ పంచుకోవడం సర్వసాధారణమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా కానీ ట్రంప్‌కు దూరంగా రిపబ్లికన్ ఎంపీలు ఉంటున్నారని మీడియా పేర్కొంటోంది. ఇది 2018 మధ్యంతర ఎన్నికలకు దారి తీయవచ్చని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర దర్యాప్తును ఏర్పాటు చేయడం, ప్రతిదీ బహిర్గతం చేయడమొక్కటే ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చగలుగుతుందని భావిస్తున్నట్లు కాంగ్రెస్, అధ్యక్ష భవనం వ్యవహారాల అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాన్ మహఫీ పేర్కొన్నారు. దీనివల్ల ట్రంప్ విధాన ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు. పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ బిల్లు రద్దు అంశాలపై చర్చ జరపడానికి బదులుగా రష్యా పాత్రపై దర్యాప్తు, ట్రంప్ న్యాయాన్ని అడ్డుకుంటున్నారా అనే అంశాలపై చర్చ జరుగుతోందని మరో నిపుణుడు డారెల్ వెస్ట్ వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/