Begin typing your search above and press return to search.

భారతీయ అమెరికన్ల చూపు.. ట్రంప్ వైపు!

By:  Tupaki Desk   |   19 Oct 2016 4:17 AM GMT
భారతీయ అమెరికన్ల చూపు.. ట్రంప్ వైపు!
X
"హిందువులకు నేను పెద్ద అభిమాని"నంటూ ఇటీవల ర్యాలీలో అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ చేసిన ప్రసంగం గురించి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌ కు అనుకూలంగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అమెరికాలో భారతీయులపై బలమైన ప్రభావాన్నే చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా డెమోక్రటిక్‌ పార్టీకి సపోర్ట్ గా ఉన్న బలమైన సంప్రదాయ భారత సంతతి ఓటు బ్యాంకు తాజా పరిణామాల నేపథ్యంలో రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌... ఈమధ్య భారతీయ అమెరికన్లు నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయాలపై తాము నిర్వహించిన సర్వేల్లో హిల్లరీతో సమానంగా ట్రంప్ కు భారతీయ అమెరికన్ల మద్దతు లభించిందని వెళ్లడించారు "టీవీ ఆసియా " న్యూస్ చానల్ రోహిత్ వ్యాస్. ఇదే సమయంలో ఇటీవలి వరకు హిల్లరీకి మద్దతుగా నిలిచిన భారతీయ అమెరికన్లు కొంతమంది ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనవైపు మొగ్గుచూపుతుండటం ప్రారంభమైందని రిపబ్లికన్ల ప్రతినిధి సంపత్‌ శివంగి తెలిపారు. దీంతో తాను భారత్‌ కు - "హిందూ"కు పెద్ద అభిమానినని ట్రంప్ ప్రకటించిన అతి తక్కువ సమయంలోనే అమెరికా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయనే చెప్పాలి. దీంతో భారతీయ అమెరికన్లలో ప్రస్తుతం రిపబ్లికన్లు పట్టు సాధించినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంచలన వివాదాస్ప వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన ట్రంప్ మరోసారి ఆ దిశగా ముందుకు కదిలారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. హిల్లరీ క్లింటన్ "నేర సంస్థ" నడిపిస్తున్నారని, ఆమె వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశం, ప్రజల భద్రతను ఫణంగా పెట్టిందని, దానికి అమెరికా ప్రభుత్వం కూడా సహకరిస్తోందని అన్నారు. ఇదే క్రమంలో... అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రమాణ స్వీకారానికి ముందే తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ను కలిసే అవకాశముందని ట్రంప్‌ వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/