Begin typing your search above and press return to search.
వివాదంలో ఒబామా డ్యాన్స్
By: Tupaki Desk | 27 March 2016 5:57 AM GMTఅమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లాటిన్ అమెరికాలో పర్యటిస్తూ ట్యాంగో డాన్స్ చేయడంపై రిపబ్లికన్లు చిరెత్తిపోతున్నారు. ఓ పక్క ఐసిస్ ఉగ్రవాదులు రక్తపాతం సృష్టిస్తూంటే నువ్వెల్లి ఎంజాయ్ చేస్తావా, కుటుంబ సభ్యులతో ప్రపంచం పట్టని ఆనందంలో మమేకమవుతారా..క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోతో బేస్ ఆడతావా అంటూ నిప్పులు చెరిగారు. బ్రసెల్స్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 30మంది మరణించినా తన లాటిన్ అమెరికా పర్యటనను ఒబామా కొనసాగించడం విడ్డూరంగా ఉందని..తన పర్యటనను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలన్న ఆలోచనే ఒబామాలో కనిపిస్తోందంటూ విదేశీ సంబంధాల మండలి అధ్యక్షుడు రిచర్డ్ హాస్ విరుచుకు పడ్డారు.
ఒబామా పర్యటన, ప్రస్తుత పరిణామాలనపై రిచర్డ్ హాస్ మండిపడ్డారు. ఒబామా తీరు ఏ మాత్రం బాగోలేదని పేర్కొంటూ....అర్జెంటీనాకు వెళ్లడం తప్పుకాకపోయినా ఇలా డాన్స్‌లు చేయడం, బేస్ బాల్ ఆడటం, ఫొటోలు దిగే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బావుండేదని అన్నారు. ఇక సోషల్ మీడియా కూడా ఒబామా డాన్స్ లపై చురకలేసింది. ‘ఉగ్రవాద దాడుల తర్వాత ఒబామా వెనక్కి వచ్చేసి ఉండాల్సింది’అని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి జాన్ కసిక్ అన్నారు. అయితే ఉగ్రవాద దాడులు జరిగిన వెంటనే పరుగెత్తుకుంటూ వెనక్కి వచ్చేయడం వల్ల విధ్వంస శక్తులకు మరింత బలాన్నివ్వడమే అవుతుందని ఒబామా ఖండించారు.