Begin typing your search above and press return to search.

గ‌ర్భిణి కోసం హెలికాఫ్ట‌ర్ వ‌చ్చింది

By:  Tupaki Desk   |   6 Dec 2015 12:44 PM GMT
గ‌ర్భిణి కోసం హెలికాఫ్ట‌ర్ వ‌చ్చింది
X
చుట్టూ నీళ్లు. కాళ్లు తీసి బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌లేని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక గ‌ర్భ‌ణికి పురిటి నొప్పులు వ‌స్తే? ఆమె ప‌రిస్థితి ఏమిటి? క‌నుచూపు మేర నీళ్లు త‌ప్ప మ‌రింకేమీ లేని ప్రాంత‌లో ఉన్న ఆమెకు సాయం చేసేదెలా? వైద్య‌సాయం అందేది ఎలా? అన్న ప్ర‌శ్న‌కు స‌హాయ బృందాలు అత్యంత సాహ‌సోపేతంగా వ్య‌వ‌హ‌రించి గ‌ర్భిణిని సేవ్ చేశారు.

శుక్ర‌.. శ‌నివారాల్లో తెరిపి ఇచ్చిన‌ట్లుగా క‌నిపించిన‌ప్ప‌టికీ.. ఆదివారం చెన్నైలో వ‌ర్షం మొద‌లైంది. కొన్ని చోట్ల భారీగా..మ‌రికొన్ని చోట్ల కొద్దిపాటి వ‌ర్షం కురుస్తుంది. తాజా వ‌ర్షంతో ముమ్మ‌రంగా సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లిగే పరిస్థితి. ఆకాశం మేఘాలు ప‌ట్టిన వేళ‌.. ఒక గ‌ర్భిణి సాయం కోసం ఎదురుచూస్తుంటే.. ఆ స‌మాచారాన్ని స‌హాయ‌క బృందాల‌కు అందించారు.

దీంతో.. స్పందించిన స‌హాయ‌క బృందాలు బాధితురాలి ఇంటి వ‌ద్ద‌కు హెలికాఫ్ట‌ర్ లో తెచ్చారు. చుట్టూ నీళ్లు ఉండ‌టం.. బాధితురాలు ఉన్న ఇంటి టెర్ర‌స్ చిన్న‌ది ఉండ‌టంతో అత్యంత సాహ‌సోపేతంతో ఆమెను ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు.
టెర్ర‌స్ మీదున్న వాట‌ర్ ట్యాంక్ మీద‌కు ఆమెను నిచ్చెన‌తో త‌ర‌లించి.. ఆపై హెలికాఫ్ట‌ర్ నుంచి నిచ్చెన లాంటి తాడును జార‌విడిచారు. మిగిలిన వారి సాయంతో ఆమెను జాగ్ర‌త్త‌గా తాడు మీద ఎక్కించారు. అతి ప్ర‌యాస‌తో ఆమెను హెలికాఫ్ట‌ర్ లోకి సేఫ్ గా తీసుకెళ్లిన బృందం ఆమెకు వైద్య సాయం అందించేందుకు వెళ్లాయి. విప‌రీత‌మైన ఉత్కంట రేకెత్తించిన ఈ ఘ‌ట‌న‌ను చూసిన స్థానికులు.. ఎట్ట‌కేల‌కు క్షేమంగా హెలికాఫ్ట‌ర్ లోకి గ‌ర్భిణిని తీసుకెళ్ల‌టం చూసి.. త‌మ క‌ష్టాల్ని.. ఆక‌లిని మ‌ర్చిపోయి ఆనందంతో కేక‌లు వేయ‌టం గ‌మ‌నార్హం. ఈ మొత్తం ఘ‌ట‌న చూసిన‌ప్పుడు.. యాంత్రికంగా మారిన మ‌నిషిలోని మాన‌వత్వాన్ని.. స‌వాలు విసిరి మ‌రీ త‌ట్టి లేపిన‌ట్లుగా అనిపించ‌ట్లేదు.