Begin typing your search above and press return to search.
ఆ దేశంలో మగాళ్లను ఆడోళ్లు రేప్ చేస్తున్నారట
By: Tupaki Desk | 31 July 2017 5:30 PM GMTనిజానికి ఈ వాక్యంలో గ్రామర్ మిస్టేక్ ఉంది. ఎందుకంటే.. మహిళపై అత్యాచారం చేస్తే రేప్ అంటారు. అదే సమయంలో మగాడికి ఇష్టం లేకుండా మహిళ బలవంత శృంగారం చేస్తే దాన్ని రేప్ అనరు. ఫోర్సెడ్ టు పెనెట్రేట్ అని వ్యవహరిస్తారు. ఈ పదం సుపరిచితం కాకపోవటంతో రేప్ అన్న మాటను తప్పనిసరిగా వాడాల్సి వచ్చింది. హెడ్డింగ్ చూసినంతనే.. ఇలాంటివి ఎక్కడైనా విన్నామా? మరెక్కడైనా చూశామా? అన్న భావన కలగటం ఖాయం. కానీ.. ఇలాంటి ఒకటో.. రెండో కాదు.. ఈ మధ్యన ఎక్కువైపోతున్నట్లుగా బ్రిటన్ లో జరిపిన తాజా అధ్యయనం వెల్లడించటం సంచలనంగా మారింది.
సహజంగా ఆడాళ్లపై మగవారు లైంగిక దాడులకు పాల్పడతారన్నది తెలిసిందే. అయితే.. బ్రిటన్ లో మాత్రం కొన్నేళ్ల నుంచి మగాళ్లపై మహిళలు లైంగిక దాడికి పాల్పడుతున్నారట. ల్యాంకస్టెర్ వర్సిటీ జరిపిన తాజా అధ్యయనంలో ఇలాంటి చిత్రవిచిత్రమైన విషయాలు బయటకు వచ్చాయి.
బ్లాక్ మొయిల్ చేయటం.. బెదిరించటం.. దూషించటం..వదంతులు ప్రచారం చేయటం.. మీ సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చి మరీ పురుషులపై మహిళలు ఆ దేశంలో అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా వెల్లడించింది. మహిళలపై జరిగే లైంగికదాడికి సంబంధించి అధ్యయనాలు చాలానే చూశాం కానీ.. పురుషులపై మహిళల లైంగిక దాడి మీద మాత్రం మొదటిసారి అధ్యయనం నిర్వహించారు. ఎంతమంది బాధితులతో ఈ అధ్యయనం చేశారన్న అంశం బయటకు రాలేదు. కానీ.. అధ్యయనం చేసిన తర్వాత మాత్రం.. ఈ సమస్య చాలా ఎక్కువగా ఉందన్న విషయం బయటకు వచ్చిందని చెబుతున్నారు.
తాజా అధ్యయన వివరాలు సంచలనంగా మారాయి. అయితే.. బ్రిటన్ చట్టాల ప్రకారం ఈ తరహా ఫోర్సెడ్ టు పెనెట్రేట్ కు శిక్ష లేదట. సహజంగా మగవాడు మాత్రమే మహిళల్ని అత్యాచారం చేయగలరు కానీ.. ఆడాళ్లు అలా చేస్తారన్న ఆలోచన అస్సలు లేకపోవటం.. మహిళలతో శృంగారం పురుషులు ఎల్లప్పుడూ అస్వాదిస్తారన్న అపోహ కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. ఏమైనా తాజా అధ్యయనం పుణ్యమా అని బ్రిటన్ చట్టాల్ని సవరించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లేనని చెబుతున్నారు.