Begin typing your search above and press return to search.

ఆ తోకచుక్కతో కిక్కే కిక్కు

By:  Tupaki Desk   |   26 Oct 2015 7:15 AM GMT
ఆ తోకచుక్కతో కిక్కే కిక్కు
X
విశ్వంలో ఎన్నో వింతలు.. నిత్యం ఖగోళ పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు ఎన్ని వింతలను వెలుగులోకి తెస్తున్నా ఇంకా కొత్తవి వస్తూనే ఉంటున్నాయి. విశ్వాంతరాళంలో జీవం ఉనికి కోసం అనే్వషిస్తున్న శాస్తవ్రేత్తలు తాజాగా ఆశ్చర్యకరమైన ఒక సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. లవ్‌ జాయ్ అనే ఒక తోకచుక్క నుంచి భారీస్థాయిలో ఆల్కహాల్‌ రిలీజ్ అవుతోందట. ఇది సెకనుకు దాదాపు 500 వైన్ బాటిళ్ల పరిమాణంలో ఇథైల్ ఆల్కహాల్ విడుదలచేస్తోందట. జీవం ఆవిర్భావానికి ఎంతో ముఖ్యమైన సేంద్రియ పదార్థాలు ఈ తోకచుక్కలో ఉండవచ్చని ఈ ఆవిష్కరణ స్పష్టం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ తోకచుక్కలో ఇథైల్ ఆల్కహాల్ - గ్లైకాల్ ఆల్డీహైడ్ అనే ఒక రకం చక్కెర సహా 21 రకాల సేంద్రియ పదార్థాలు వాయువు రూపంలో ఉన్నట్లు శాస్తవ్రేత్తల బృందం గుర్తించింది. ఇథైల్ ఆల్కహాల్ ను మద్యం తయారీలో ప్రధానంగా వాడుతారన్న సంగతి తెలిసిందే. మరి ఈ సంగతి తెలిస్తే మద్యం ప్రియులు చంద్రయాన్ - మంగళయాన్ మాకొద్దు... ఈ తోకచుక్కపైకి తీసుకెళ్లమంటారేమో? ఎందుకంటే సెకనుకు 500 వైన్ బాటిల్లతో సమానంగా నిఖార్సయిన ఇథైల్ ఆల్కహాల్ దొరుకుతుంటే మద్యం ప్రియులకు అంతకంటే ఇష్టమైన ప్లేసు ఇంకేముంటుంది!