Begin typing your search above and press return to search.
రెండేళ్ల వరకు వదల బొమ్మాళీ అంటున్న కరోనా
By: Tupaki Desk | 2 May 2020 9:50 AM GMTకరోనా వైరస్ వదల బొమ్మాళీ అంటూ ఆ మహమ్మారి అంటోంది. ఇంకా రెండేళ్ల వరకు ఆ వైరస్ మనల్ని వెంటాడుతూనే ఉంటుందంట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రభావం ఇప్పుడిప్పుడే తొలగేది కాదని హెచ్చరిస్తున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ వైరస్‌ను క్రమంగా మానవ ప్రపంచం నుంచి తరిమివేయవచ్చని పేర్కొంటున్నారు. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది రోగ నిరోధక శక్తి వచ్చేవరకు ఆ వైరస్‌ను నియంత్రించలేమని నిపుణుల బృందం ఒక నివేదిక లో తెలిపింది. అనారోగ్య లక్షణాలు కనిపించని వ్యక్తుల నుంచి వ్యాప్తి చెందగల సామర్థ్యం కారణంగా ఆ వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంటుందని చెబుతున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడం కష్టమని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొట (University of Minnesota)లోని సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్స్ డిసిస్ రీసెరచ్ పాలసీ (Center for Infectious Disease Research, Policy) తన నివేదికలో వెల్లడించింది.
కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం మొదలుపెడితే అప్పుడు ఆ వైరస్‌ను గుర్తించి చికిత్స అందించేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఒక దేశం నుంచి మరో దేశానికి కరోనా వ్యాప్తిని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం కేసులు తగ్గాయని ఇప్పుడు వ్యాపారాలు, బహిరంగ ప్రదేశాలను తిరిగి తెరవడానికి అనుమతించడంతో ప్రమాదమే ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనావైరస్ మహమ్మారి 2022 దాటినా కూడా ఇంకా వ్యాప్తిచెందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
రిస్క్ కమ్యూనికేషన్ మెసేజింగ్ ఇప్పుడిప్పుడే అంతమైపోదని, ఈ మహమ్మారి ఇంకా కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. రెండేళ్లలో ఈ వైరస్ తిరిగి వస్తుందని, దాన్ని తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. దీనికి ఆలోపు వ్యాక్సిన్ కని పెడితే పరిస్థితులు సద్దు మణిగే ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటి నుంచే వ్యాక్సిన్లను తయారు చేయడానికి పరిశోధకులు ప్రయత్నాలు చేయాలని చెప్పారు.