Begin typing your search above and press return to search.
కరోనా ముగింపు దశపై పరిశోధకులు ఏమంటున్నారు..?
By: Tupaki Desk | 27 Jan 2022 9:56 AM GMTకొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యం చిన్న దేశం అనే తేడా లేకుండా వైరస్ సోకుతోంది. గ్యాప్ ఇస్తూ దశల వారీగా మహమ్మారి విజృంభిస్తోంది. 2019 డిసెంబర్ నుంచి కరోనా అందరినీ భయపెడుతోంది. ఆ తర్వాత 2021 మార్చి నుంచి మళ్లీ విశ్వరూపం చూపించింది. ఇక గతేడాది డిసెంబర్ మూడో వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ వస్తోంది. ఆ తర్వాత నూతన సంవత్సరం వేడుకలతో ఒక్కసారిగా కేసులు పెరుగుతూ వచ్చాయి.
అయితే ఫిబ్రవరి తాగా వైరస్ ప్రభావం ఇలాగే ఉంటుందని పలువురు వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీని తర్వాత కరోనా మళ్లీ రూపంలో మారబోతుంది? కరోనా ముగింపు దశ ఇదేనా? నిపుణులు ఏమంటున్నారంటే..
దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ వేరియంట్ అతి తక్కువ ప్రమాదకరం అయినా కూడా అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరికి జెట్ స్పీడ్ లో విస్తరిస్తోంది. అయితే ఈ వేరియంట్ ఇక చివరిదని... ఈ దశతో వైరస్ ముగింపునకు చేరుకుంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా ఇది కచ్చితంగా ముగింపు దశ అని ఇప్పుడే చెప్పలేమని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్ ఎప్పుడు... ఏ రూపంలో మార్పు చెందుతుందో అంచనా వేయలేని విధంగా ఉందని చెబుతున్నారు. వైరస్ తో ముప్పు ఇప్పుడు తక్కువ ఉన్నా కూడా.. మళ్లీ ప్రమాదకరం అయ్యే ఛాన్సు ఉందని అభిప్రాయపడుతున్నారు. కరోనా, దాని వేరియంట్లపై ఇంకా పరిశోధనలు ముమ్మరంగా సాగుతూనే ఉన్నాయని వివరించారు.
రోజురోజుకూ వైరస్ వేరియంట్ల మాదిరి మార్పు చెందుతోంది. అయితే మనం తీసుకున్న టీకాతో పూర్తి స్థాయి రోగ నిరోధక శక్తి పొందుతాము అనేది కూడా సందేహమేనని అంటున్నారు. కరోనాను పూర్తి స్థాయిలో ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని కూడా మనం కలిగిఉన్నామా? లేదా అనేది ఇప్పుడే పరిశీలించలేమని తెలిపారు. కాగా ముందుముందు వైరస్ ఏ విధంగా మారుతుంది? వాటితో ప్రమాదం ఎంతవరకు ఉందనే అంశంపై ఇప్పుడే క్లారిటీ రాదని చెబుతున్నారు.
వైరస్ కొత్త రూపాలు ఎంత ప్రమాదకరమో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే వైరస్ మహమ్మారి నుంచి సాధారణ ఫ్లూగా మారిపోయిందని మరికొందరు పేర్కొంటున్నారు. కరోనాతో కలిసి జీవించాల్సిందేనని... ముందు ముందు అంత ప్రమాదకం ఉండబోదని వివరిస్తున్నారు. కాబట్టి వైరస్ సాాధారణంగా మారడం ఉండదని... కానీ దాని ముప్పు అతి స్వల్పంగా మారే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించారు.