Begin typing your search above and press return to search.

రిజైన్ మోడీ.. ట్విట్టర్ లో ఇదే ట్రెండింగ్!

By:  Tupaki Desk   |   20 April 2021 5:31 AM GMT
రిజైన్ మోడీ.. ట్విట్టర్ లో ఇదే ట్రెండింగ్!
X
ఒక సామాన్యుడు, చాయ్ వాలా దేశానికి ప్రధాని కాకూడదా? అని 2014 ఎన్నికల్లో దీనంగా అడిగిన మోడీకి రెండు సార్లు ఆ పదవిని ఇచ్చారు దేశ ప్రజలు. సామాన్యుడు సామాన్యుల కష్టాలు తీరుస్తాడనుకున్నారు. సోషల్ మీడియానే ఆయుధంగా వాడి గద్దెనెక్కిన మోడీకి ఇప్పుడు అదే సోషల్ మీడియా పక్కలో బల్లెంలా తయారైంది.

కరోనా లాక్ డౌన్ లో మోడీ వ్యవహరించిన తీరు.. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పన పోయి.. నిరుద్యోగం ప్రబలిన సమయంలో మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజలకు రుచించలేదు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికానికి తోడు కరోనా విలయతాండవం చేస్తుండడం.. కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజలకు మేలు చేయకపోగా కార్పొరేట్లకే దోచిపెట్టాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. కొంత కాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ వ్యతిరేకతను అంతా నెటిజన్లు సోషల్ మీడియాలో తీర్చేసుకుంటున్నారు. కరోనాను అదుపు చేయడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని.. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి పదవి నుంచి మోడీ తప్పుకోవాలని ట్విట్టర్ మారుమోగుతోంది.

గత ఏడాది ఆగస్టులో సోషల్ మీడియాలో మొదటి సారి మోడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన నిర్వహించిన మన్ కీ బాత్ పై నెటిజన్లు డిస్ లైక్ ల మోత మోగించారు. జేఈఈ, నీట్ పరీక్షలపై మాట్లాడని మోడీ వీడియోను 18 లక్షల మంది చూస్తే 74 మంది లైక్ చేస్తే.. 5 లక్షల మంది డిస్ లైక్ చేశారు. ఆ పరంపర నేటికి కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు తాజాగా ‘రిజైన్ మోడీ’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ మారింది. ఇప్పటికే దీనిపై దేశ ప్రజలంతా 2,30,000కు పైగా మంది ట్వీట్స్ చేసి మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా కల్లోలంలో ఏం చేయలేని మోడీ దిగిపోవాలంటున్నారు. మోడీ వెంటనే ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ట్విట్టర్ ఇప్పుడు మారుమోగుతోంది.