Begin typing your search above and press return to search.
ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న రాజీనామాల పర్వం.. రీజనేంటి?
By: Tupaki Desk | 15 Jan 2022 11:30 PM GMTదేశ ఇన్ఫర్మేషన్, సాంకేతిక రంగం.. ఐటీ పెనుకుదుపునకు గురవుతోంది. ఉద్యోగులరాజీనామాలు, విధులకు గైర్హాజర్ వంటి అనేక కీలక పరిణామాలు.. ఐటీ రంగానికి పెను శాపంగా పరిణమించాయి. దీంతో ఐటీ దిగ్గజ కంపెనీలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా IT నిపుణుల కొరత ఈ రంగాన్ని పీడిస్తోంది. దీనికితో ఉద్యోగుల రాజీనామాలు కూడా ఐటీని కుదిపేస్తోంది. దీంతో ఐటీ సేవలలో ఒకవిధమైన ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు.
స్వచ్ఛంద రాజీనామాలు పెరుగుతున్నాయి. అదేసమయంలో ఉద్యోగుల గైర్హాజరు భారతీయ ఐటీ దిగ్గజాల ఆదాయాన్ని దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి కోవిడ్ లాక్‌డౌన్న్ కాలంలో ఉద్యోగులకు ఆన్‌లైన్ పని అవకాశాలు, ఇంటి నుండి పని చేసుకునే అవకాశం కల్పించారు. అయినప్పటికీ.. ఐటీ నిపుణులు పలు ప్రముఖ కంపెనీల నుంచి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయా సంస్థలు.. తర్జన భర్జన పడుతున్నాయి.
గత త్రైమాసికంలో 50,000 మందికి పైగా కొత్త ఉద్యోగుల నియామకం జరిగింది. రెండంకెల వేతన పెంపుదల చేపట్టారు. అయినప్పటికీ.. ప్రతిభ ఉన్న నిపుణుల కొరత ఉందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. పెరుగుతున్న ఉద్యోగుల కొరత కారణంగా ప్రధాన కంపెనీలు.. ఇన్ఫోసిస్ 15.2 శాతం, విప్రో 12.1 శాతం, టిసిఎస్ 7 శాతం, హెచ్‌సిఎల్ 10 శాతం, టెక్ ఎం 14 శాతం, సైయంట్ 21 శాతం మైండ్‌ట్రీ 16 శాతం క్షీణత నమోదు చేశాయి. ఇది పరిశ్రమను కుదిపేస్తున్న పరిణామంగా నిపుణులు చెబుతున్నారు.
ఇదే పరిణామం కొనసాగితే.. రానున్న రోజుల్లో కంపెనీల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ కష్టాలకు తోడు.. గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లు(GIC), గ్లోబల్ సంస్థల ఆఫ్‌షోర్ సెంటర్‌లు కూడా గట్టి సవాలును విసురుతున్నాయి. ఐటీ పరిశ్రమల్లో టాలెంట్ కొరత ఉండడం మరో ప్రధాన కారణంగా ఉంది. ఉదాహరణకు, కాగ్నిజెంట్ 2020లో 3000 కంటే ఎక్కువ మందిని కోల్పోయింది. దీని నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులు కూడా రిజైన్ చేశారు.
BPO ప్రధాన టెక్ మహేంద్ర కూడా 3994 మంది ఉద్యోగులను కోల్పోయింది. L అండ్ T టెక్‌లో కూడా ఇదే ధోరణి కనిపించింది. స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, అట్రిషన్ మరో 3 నుంచి నాలుగు త్రైమాసికాల వరకు కొనసాగవచ్చని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. దీంతో ఇప్పుడు ఐటీ పరిశ్రమలు విలవిల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు.