Begin typing your search above and press return to search.

మీరు తిట్టుకుంటూ మమ్మల్ని అవమానించకండి!

By:  Tupaki Desk   |   20 March 2019 11:11 AM IST
మీరు తిట్టుకుంటూ మమ్మల్ని అవమానించకండి!
X
గత వారం రోజులుగా నేషనల్‌ మీడియాలో చౌకీదార్లు అనే పదం బాగా పాపులర్‌ అయ్యింది. తనని తాను చౌకీదారుగా పేర్కొంటూ మోదీ గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటున్నారు. తన ట్విట్టర్‌ ఎక్కౌంట్‌ ని కూడా చౌకీదార్ నరేంద్రమోడీగా పేరు మార్చుకున్నారు. మోడీ మార్చుకున్నారు అని మిగిలిన బీజేపీ వాళ్లు కూడా మార్చేశారు. ఇక ఇదే అంశాన్ని తన ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు రాహుల్‌ గాంధీ. మోదీ చౌకీదార్‌ కాదు చోర్ అంటూ ప్రతీ బహిరంగా సభలో ఆరోపణలు చేస్తున్నారు. ఇలా వారం రోజులుగా చౌకీదార్‌ - చౌకీదార్ చోర్‌ అంటూ ఈ పదం బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. మోదీ - రాహుల్ తిట్టుకోవడం వల్ల తమ ఆత్మగౌరవం దెబ్బతింటుందని అసలు చౌకీదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చౌకీదార్‌ అంటే కాపలాదారు. ఇంకా పొలైట్‌ గా చెప్పాలంటే వాచ్‌ మెన్‌. దీంతో.. ఇప్పుడు అసలు వాచ్‌ మెన్లు మోదీ - రాహుల్‌ లపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాత్రనక - పగలనక మేం కష్టపడుతుంటే.. మా పేర్లు చెప్పుకుని ఇద్దరు నేతలు రాజకీయాలు చేస్తున్నారని రత్తిలాల్‌ అనే వాచ్‌ మెన్‌ బాధపడ్డాడు. చేసిన పనికంటే తక్కువ వేతనం తాము తీసుకుంటామని.. తన జీవితానికి - జీతానికి ఎలాంటి భద్రత లేదని చెప్పుకొచ్చారు. నిజంగా చౌకీదార్లుపై అంత ప్రేమ ఉంటే.. ప్రభుత్వ పరంగా వారికి ఏదైనా చెయ్యాలని సూచించారు. రాజకీయాల కోసం తమ వృత్తిని వాడుకుంటున్నారని ఆరోపించారు.