Begin typing your search above and press return to search.
రోజా స్పీచ్ కు ప్లీనరీలో ఫుల్ రెస్పాన్స్
By: Tupaki Desk | 9 July 2017 2:40 PM GMTవైసీపీ ప్లీనరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచినారిలో ఎమ్మెల్యే రోజా ఒకరు. సాధారణంగానే రోజా మాట్లాడితే అంతా చెవులు రిక్కించి వింటారు. అందులోనూ ప్లీనరీ సందర్భంగా రోజా మైకు అందుకోగానే క్యాడర్ నుంచి అంతేస్థాయి ఎక్స్ పెక్టేషన్ కనిపించింది. పార్టీ శ్రేణులు అంచనాలకు తగ్గట్లుగానే రోజా తన పదునైన ప్రసంగంతో ప్లీనరీకి ఊపు తెచ్చారు.
మధ్యమధ్యలో సామెతలు చెబుతూ - ప్రభుత్వాన్ని విమర్శిస్తూ క్యాడర్ లో ఉత్సాహం నింపారు.ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తన ప్రసంగంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. ‘చంద్రబాబు హయాంలో దగాపడ్డ డ్వాక్రా మహిళ’ అనే తీర్మానాన్ని ఆమె ప్రవేశపెడతారాంటూ ఆమె పేరు చదవగానే సభ మార్మోగిపోయింది. రోజా సభావేదికపైకి వస్తూనే జై వైఎస్సార్ - జై జగన్ అని నినాదాలు చేయగా సభికులంతా తాము కూడా జై వైఎస్సార్ - జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. తెలుగు సామెతలను చంద్రబాబు ప్రభుత్వానికి ఆమె మాట్లాడుతుంటే విజిళ్లు - చప్పట్లు పడ్డాయి. మహిళల సమస్యలు వివరిస్తూనే... ఏపీలో దుర్యోధన - దుశ్శాసన దుర్మార్గపు పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. మంచినీరు లేకున్నా మద్యాన్ని చంద్రబాబు పారిస్తున్నారని విమర్శించారు. చీఫ్ మినిస్టర్ ఛీప్ లిక్కర్ కు ప్రమోటర్ గా మారారని, బార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని రోజా చేసిన కామెంట్లకు క్యాడర్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. భల్లాల దేవుడిలాంటి చంద్రబాబును మహేంద్ర బాహుబలిలాంటి జగన్ ఓడిస్తారని.. 2019లో పట్టాభిషిక్తుడవ్వడం ఖాయమని.. ఈ ప్లీనరీ చూస్తోంటే 2 ఏళ్ల తర్వాత జరుగబోయే జగన్ ప్రమాణ స్వీకారం గుర్తొస్తుందంటూ అందరిలో ఉత్సాహం నింపారు. జగన్‌ను అసెంబ్లీ టైగర్ - ఆంధ్రా ఫ్యూచర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తడంతో సభలో హర్షధ్వానాలు మోగాయి.