Begin typing your search above and press return to search.
ఒక పనోడి కోసం పని చేస్తున్న రెస్టారెంట్
By: Tupaki Desk | 11 Dec 2015 8:28 AM GMTసింగపూర్ లో చాలానే రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ.. కాంపాంగ్ బెహ్రు రోడ్ లోని ‘‘స్ట్రేంజర్స్ రీయూనియన్’’ రెస్టారెంట్ కి ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు. అది కూడా మంగళవారాలే. వారంలో మిగిలిన రోజులు ఒక మోస్తరు రద్దీ ఉన్నా.. మంగళవారం వస్తే చాలు.. జనాలు కిక్కిరిసి.. క్యూలు కట్టే పరిస్థితి. తమ వంతు వచ్చేసరికి ఆలస్యమైనా అస్సలు పట్టించుకోవటం లేదు. నిజానికి మంగళవారాలు ఆ రెస్టారెంట్ కు పని చేసేది కాదు. కానీ.. తన దగ్గర పని చేసే చీఫ్ చెఫ్ కు సాయం కోసం ఆ రెస్టారెంట్ యజమాని చేసిన ఒక పోస్టింగ్ తాజా రద్దీకి కారణం. ఇంతకీ ఆ రెస్టారెంట్ యజమాని ఏం చేస్తున్నాడు? ఆ రెస్టారెంట్ చీఫ్ చెఫ్ కు ఏమైందంటే..?
స్ట్రేంజర్స్ రీయూనియన్ రెస్టారెంట్ లో పని చేసే 26 ఏళ్ల సెబాస్టియన్ ఇటీవల క్యాన్సర్ బారిన పడ్డాడు. అతన్ని ఆదుకునేందుకు భారీగా ఆర్థిక సాయం అవసరమైంది. అంత డబ్బు.. ఆ రెస్టారెంట్ యజమానికి ఇబ్బంది. అందుకే.. రెస్టారెంట్ కి సెలవురోజు అయిన మంగళవారం.. దాన్ని ఓపెన్ చేసి వ్యాపారం చేద్దామని.. ఆ రోజు వచ్చే మొత్తం డబ్బును సెబాస్టియన్ కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి రెస్టారెంట్లో పని చేసే సిబ్బంది చేతులు కలిపారు. ఈ రోజున తాము ఉచితంగా పని చేయాలని నిర్ణయించారు.
ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టాడు ఆ రెస్టారెంట్ యజమాని. తన చీఫ్ చెఫ్ కు సాయం చేసేందుకు మంగళవారం నాడు తాము చేసే పని గురించి వివరించాడు. సాయం ఏమీ చేయక్కర్లేదని.. మంగళవారం తన రెస్టారెంట్ కి వచ్చి భోజనం చేస్తే చాలని కోరాడు. అంతే.. ఆ మెసేజ్ వైరల్ అయ్యింది. ఇప్పుడు మంగళవారం వచ్చిందంటే..ఆ రెస్టారెంట్ దగ్గర జాతరగా మారింది. అక్కడ తినేందుకు క్యూలు కడుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనకు ఆ రెస్టారెంట్ యజమానితో పాటు.. సిబ్బంది హ్యాపీగా ఫీలవుతున్నారు. ఒక రోజు కష్టం.. ఒక మనిషి నిండు ప్రాణాన్ని కాపాడుతుందంటే ఏం కావాలి? సాయం చేయాలని అనుకోవాలే కానీ.. అండగా నిలవటానికి చాలామందే సిద్దంగా ఉన్నారన్న విషయం ఈ ఉదంతం మరోసారి నిరూపించిందని చెప్పొచ్చు.