Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్ :కీలక నిర్ణయం తీసుకున్న వాట్సాప్..టిక్ టాక్ బ్యాన్ కి డిమాండ్!
By: Tupaki Desk | 7 April 2020 10:50 AM GMTకరోనా మహమ్మారితో ఒకవైపు ప్రపంచం అల్లాడిపోతుంటే ..మరోవైపు ఫేక్ వార్తలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడో జరిగిన కొన్నింటిని , -కొద్దిగా మార్పులు - చేర్పులు చేసి - కొద్దిగా మ్యాటర్ యాడ్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. చట్టపరంగా వీటి నిరోధానికి చర్యలను ప్రకటిస్తున్నప్పటికీ ఫేక్ న్యూస్ ప్రవాహం ఆగడం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన నకిలీ వార్తలు - వీడియోలు వాట్సాప్ - ఫేస్ బుక్ - ట్విటర్ - టిక్ టాక్ లాంటి ప్లాట్ ఫాంలలో విరివిగా షేర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీద తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా - వీడియోను ఒకసారి ఒక చాట్ కు మాత్రమే ఫార్వార్డ్ చేసేలా వాట్సాప్ ఆంక్షలు విధించింది.
ఈ నేపథ్యంలో మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్ లో ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాన్ని తెలుసుకునే వాట్సాప్ కొత్త ఆంక్షలను విధించింది. కరోనా తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం వాట్సాప్ లో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు షేర్ చేయబడిన సందేశాలను ఒక చాట్ కు మాత్రమే ఫార్వార్డ్ చేయగలం. గతంలో నకిలీ వార్తలను అడ్డుకునే నేపథ్యంలో ఐదుసార్లకు మించి ఫార్వార్డ్ చేయకుండా పరిమితి విధించడంతో 25 శాతం ఫేక్ న్యూస్ బెడద తప్పిందని వాట్సాప్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
ఇకపోతే ,ఈ కరోనా వైరస్ విజృంభణకు కారణం చైనానే అని చాలా దేశాలు చైనా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో #MakeChinaPay, #ChinaLiedPeopleDied అనే హ్యష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ప్రభావం భారత్ లోనూ అధికంగానే ఉంది. వైరస్ వ్యాప్తికి కారణమైందన్న కోపంతో ఇప్పటికే అనేక మంది చైనా తయారు చేసిన వస్తువులను బహిష్కరిస్తున్నారు. ఈ సమయంలోనే చైనా యాప్ టిక్‌టాక్‌ను కూడా తమ మొబైల్స్ నుంచి తొలిగించేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకు #BoycottTikTok, #BoycottChineseProducts అంటూ చైనాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.
చైనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయం అని , భారత్ టిక్ టాక్ వాడకాన్ని నిలిపివేస్తే చైనా దాదాపు రోజుకి 1 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోతుందని, 250 మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోతారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం టిక్ టాక్ యూజర్లలో సగం మంది ఇండియాకు చెందినవారే కావడం గమనార్హం. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం భారతీయులు రోజులో సగటున 52 నిమిషాలు పాటు టిక్ టాక్ లో గడుపుతున్నట్లు వెల్లడైంది. దీనితో టిక్ టాక్ ని బ్యాన్ చేయాలనే డిమాండ్ ఎక్కువైపోతోంది.