Begin typing your search above and press return to search.
యాంకర్లు ముసుగులేసుకొని వార్తలు చెప్పాల్సిందే?
By: Tupaki Desk | 20 May 2022 6:30 AM GMTఅప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన చేపట్టినప్పటి నుంచి మహిళలకున్న హక్కులన్నీ కాలరాశారు. వారికి స్వేచ్ఛ లేకుండా చేశారు. దేశంలోని మహిళలకు చదువు, దుస్తులు వంటి అనేక విషయాలపై రకరకాల ఆంక్షలు విధించారు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గద్దెనెక్కక ముందు మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన తాలిబన్ల హామీలు నీటిమూటగా మారాయి. తాజాగా టీవీ యాంకర్లపైనా తాలిబన్లు ఆంక్షలు విధించారు. వార్తల ప్రసార సమయాల్లో మహిళా టీవీ యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలకు ఎదురుచెప్పే పరిస్థితి కానీ.. వాటిపై బహిరంగంగా చర్చించే పరిస్థితి కానీ మహిళా యాంకర్లకు లేకుండా పోయింది. దీంతో తప్పనిసరి పరిస్తితుల్లో మహిళా యాంకర్లు కూడా ముఖాలకు మాస్కులు ధరించి ప్రసారాలను కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కొందరు యాంకర్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
గతంలోనూ తాలిబన్లు ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో తాలిబన్లు కొన్ని కఠినతరమైన నిబంధనలు పెట్టారు. బుర్ఖా లేకుండా మహిళలు రోడ్డుపైకి రావొద్దని అంటున్నారు. ఇక బాలికలను చదువులకు దూరం చేశారు. బాలికల ఉన్నత విద్యకు అనుమతించడం లేదు. ఆరోతరగతి వరకే పరిమితం చేస్తున్నారు. ఇక రోడ్డుపై వాహనాల్లో వెళితే మధ్యలో చెక్ పోస్టులు ఉంటాయని, అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని అంటున్నారు.
ఇక మహిళల ఉద్యోగాలపైనా తాలిబన్ల ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాజాగా అప్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబన్ ప్రభుత్వం నిలిపివేసింది. అప్ఘన్ లోని కాబూల్, ఇతర ప్రావిన్స్ లలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీని నిలిపివేసినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతానికి మహిళా డ్రైవర్లకు లైసెన్స్ లు జారీ చేయవద్దని మౌళికంగా ఆదేశాలు ఇచ్చామని.. అయితే మహిళలు డ్రైవింగ్ చేయవద్దని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ట్రాఫిక్ హెడ్స్ చెబుతున్నారు. తాలిబన్ల ప్రభుత్వం తాజా ఆదేశాలతో తర్వాత తరానికి మాకు లభించిన అవకావఆలు అందవని మహిళలు వాపోతున్నారు.
గత ఏడాది ఆగస్టులో అప్ఘాన్ ప్రభుత్వం పతనమై తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్ఘానిస్తాన్ లో మానవ హక్కుల పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో పోరాటాలు ముగిసినప్పటికీ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.