Begin typing your search above and press return to search.
న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు.. అద్దెకు న్యూఇయర్ అడ్డాలు
By: Tupaki Desk | 26 Dec 2021 4:30 PM GMTఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వం క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు జనసమూహాలపై నియంత్రణ విధించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాసులు నిరాశపడుతున్నారు. కొత్త సంవత్సర వేడుకలకు నగరవాసులు ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదారుగురు స్నేహితులు బృందంగా ఏర్పడి ఫాంహౌస్ లో పార్టీలకు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక మరికొందరేమో గోవాలో కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు. హోటళ్లు, పబ్ లు, క్లబ్ లు నిర్వహించే పార్టీలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలలో ఇబ్బందులు పడే బదులు శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్ లు, వ్యక్తిగత గృహాలను యాజమానుల నుంచి అద్దెకు తీసుకొని వ్యక్తిగత ఏర్పాట్లతో కొత్త సంవత్సరం వేడుకలకు రెడీ అవుతున్నారు.
ప్రతీ సంవత్సరం నగరంలోని ప్రముఖ హోటల్స్, పబ్ లు, క్లబ్ లు ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలు కొత్త సంవత్సర వేడుకలను పార్టీలుగా ప్లాన్ చేసేవి. 2-3 నెలల ముందు నుంచే ఈ ప్రణాళికలు వేసేవారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలబ్రెటీలతో ఈవెంట్లను నిర్వహించేవారు.
కరోనా కంటే ముందు కొత్త సంవత్సరం వేడుకలు హైదరాబాద్ నగరంలో 250కి పైగా ప్రాంతాల్లో ఘనంగా జరిగేవి. ఈవెంట్ కోసం ప్రాంగణం దొరకడమే కష్టంగా ఉండేది. కానీ గత రెండేళ్లుగా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆయా ఈవెంట్లు పెద్దగా జరగడం లేదు. ఈసారి ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా మరోసారి నిరుత్సాహామే ఎదురైందని ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వాహకులు తెలిపారు.
పబ్ లు, క్లబ్ లలో కొత్త ఏడాది సెలబ్రేషన్స్ పై పోలీసులు పరిమితులు పెట్టిన నేపథ్యంలో పార్టీ ప్రియులు వ్యక్తిగత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఐదారుగురు మంది స్నేహితులు బృందంగా ఏర్పడి గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి కొత్త సంవత్సర వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. దీంతో చాలా మంది ఫామ్ హౌస్ లలో పార్టీలు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. రోజుకు అద్దె రూ.5వేలుగా చెబుతున్నారని తెలిసింది. కరోనా కంటే ముందు పోలిస్తే 20-30 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు. అదనపు చార్జీలతో మద్యం ఫుడ్, ఇతరత్రా వాటిని ఫాంహౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.