Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ పై ఆంక్షలు..: నష్టం 40 వేల కోట్లు..

By:  Tupaki Desk   |   10 Jan 2022 7:31 AM GMT
ఇంటర్నెట్ పై ఆంక్షలు..: నష్టం 40 వేల కోట్లు..
X
సెన్సార్.. ఈ పదం ప్రతీ సినిమా విడుదల సమయంలో వింటుంటాం. సినిమాల్లో అసభ్యకర, అశ్లీలత, తదితర సన్నివేశాలను కత్తిరించేందుకు ప్రత్యేకంగా సెన్సార్ బోర్డు ఉంటుంది. కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాయింట్లు సెన్సార్ కట్ కు గురవుతుంటాయి. సినిమా సెన్సార్ విషయం పక్కనబెడితే.. ఇప్పుడు వెబ్ సెన్సార్ చాలా యాక్టివ్ గా పనిచేస్తోంది. ఇంటర్నెట్ లో యూజ్ చేసే కొన్ని యాప్స్ పై ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఈ ఆంక్షల వల్ల భారీగా నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నష్టం 2021లో 40 వేల కోట్లు ఉందని డిజిటల్ సెక్యూరిటీ అండ్ రైట్స్ గ్రూప్ 10 వీపీఎన్ రిపోర్టు ఇచ్చింది.

సినిమాల్లో అయితే అశ్లీలత, అసభ్యకర సన్నివేశాలను కారణం చెప్పి సెన్సార్ కట్ చేస్తుంది. కానీ ఇంటర్నెట్ లో శాంతి భద్రతల బూచి చూపెడుతున్నారని కొందరు అంటున్నారు. అయితే డిజిటల్ సెక్యూరిటీ అండ్ రైట్స్ గ్రూప్ 10 వీపీఎన్ రిపోర్టు ప్రకారం.. రూ.40 వేల కోట్లకు పైగా ఇంటర్నెట్ సెన్సార్ వల్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.ఇటీవల ఇంటర్నెట్ సెన్సారింగ్ ఎక్కువవుతోంది. ఏదో ఒక అంశం మీద కొన్ని చోట్ల ఆంక్షలు విధిస్తున్నారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఆంక్షల వల్ల భారీగా నష్టపోతున్నామని కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి.

ఇంటర్నెట్లో ఆంక్షల కారణంగా మయన్మార్ దేశంలో అత్యధికంగా నష్టం వాటిల్లింది. కొన్ని నివేదికల ప్రకారం రూ.18 వేల కోట్లకు పైగానే నష్టపోయినట్లు సమాచారం. అ తరువాత నైజీరియా దేశం ఉంది. గత జూన్ ట్విట్టర్ ను ఈ దేశంలో బ్లాక్ చేయడం వల్ల దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి భారత్లోనూ ఉంది. ఇక్కడ విధిస్తున్న ఆంక్షలతో నష్టాల పాలైనట్లు కొన్ని సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే భారత్లో ఎంత నష్టం వాటిల్లిందో మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇంటర్నెట్ ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 468 మిలియన్ల మంది ఇబ్బందులు గురైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అంటే ఆంక్షల చట్రంలోకి వచ్చిన వారి సంఖ్య 81 శాతానికి పెరిగిందన్నమాట. ఇందులో ప్రభుత్వ ఆంక్షలతో వాటిల్లిన నష్టం 36 శాతంగా చెబుతున్నారు.

అయితే ఈ ఆంక్షల వల్ల బ్రౌజింగ్, ఇతరత్రా సేవలతో పాటు యాడ్స్, కస్టమర్ సపోర్ట్ సేవలకు విఘాతం కలుగుతుంది. కొత్త సంవత్సరంలోనూ ఈ ఆంక్షలు విపరీతంగా కొనసాగుతున్నాయి. కజకిస్తాన్, సూడాన్లో నెలకొన్ని రాజకీయ సంక్షోభాల కారణంగా ఇంటర్నెట్ షట్ డైన్ నడుస్తోంది. కొత్త ఏడాదిలో నష్టం అప్పుడే మొదలైందని అంటున్నారు. అయితే ఇటర్నెట్ ఆంక్షల కారణంగా రాను రాను మరెంత నష్టం వాటిల్లుతుందోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.