Begin typing your search above and press return to search.
సౌదీ మహిళ డ్రైవింగ్ తప్ప ఇవేం..చేయలేదు
By: Tupaki Desk | 28 Sep 2017 1:30 PM GMTగల్ఫ్ కంట్రీలో సంపన్న దేశంగా పేరొంది సౌదీ అరేబియా తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రపంచం చూపును తన వైపు తిప్పుకొంది. సౌదీ మహిళలు మూడు దశాబ్దాల పోరాటం ఫలించి...పురుషులతో సమానంగా రోడ్లపై వాహనాలు నడుపాలన్న సౌదీ మహిళల కల సాకారం కానుంది. వచ్చే ఏడాది నుంచి వారు డ్రైవింగ్ లైసెన్సులు పొందేందుకు అర్హులవుతారు. ఈ మేరకు మహిళలకు చక్రం తిప్పే హక్కు ను సౌదీ ప్రభుత్వం మంజూరు చేసింది. మహిళల కదలికలపై సవాలక్ష నియంత్రణలు అమలులో ఉండే సౌదీ అరేబియాలో ఇది విప్లవాత్మకమైన చర్యే అయినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. సౌదీ మహిళకు ఇటీవలి కాలంలో లభించిన ఉపశమన చర్యలు అదేవిధంగా ఇప్పటికి చేయకూడని పనులు ఈ విధంగా ఉన్నాయి.
సౌదీలో మహిళలకు అనుమతి తెలిపినవి ఇవే..
- ఈ ఏడాదే బాలికలను పబ్లిక్ స్కూళ్లలోని మైదానాల్లో ఆటలాడేందుకు అనుమతి
- సౌదీ నేషనల్ డే సందర్భంగా రియాద్ లోని స్పోర్ట్స్ స్టేడియంలోకి అనుమతించారు. అదికూడా కుటుంబ సభ్యులతో కలిసి మాత్రమే
- ప్రభుత్వ కార్యాలయాల్లో సంరక్షకుడి అనుమతి లేకుండానే మహిళలకు సేవలు అందించడం
- ఉద్యోగం చేయాలంటే ఇకపై గార్డియన్ అనుమతి అవసరం లేదు
సౌదీ మహిళలు ఇప్పటికి చేయకూడని పనులు...
- బహిరంగ ప్రదేశాల్లో కుటుంబ సభ్యులతోనైనా సరే కలివిడిగా తిరడటం నిషేదం. ఇలా చేస్తే జైలు శిక్ష విధించే అవకాశం
- ప్రత్యేక ఫ్యామిలీ సెక్షన్ లేని రెస్టారెంట్లలో తినడం నిషేదం
- బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా బురఖా ధరించాల్సిందే. కాగా రియాద్ లో ఇప్పుడిప్పుడే కొంతమంది మహిళలు తమ మోహాన్ని చూపిస్తూ తిరగటం ప్రారంభమైంది
- పురుష సంరక్షకుడి అనుమతి లేకుండా పెళ్లి - విడాకులు - పాస్ పోర్టు - ప్రయాణాలు చేయడం - బ్యాంక్ ఖాతాలు తెరవడం - వైద్య సేవలు పొందడం నిషేదం
- ముస్లిం మహిళ ముస్లిం మతస్థుడు కాని వ్యక్తిని - అదేవిధంగా సున్నీ మహిళ - షియా వ్యక్తిని పెళ్లాడటం నిషిద్ధం
- ఒకవేళ విడాకులు పొందితే అబ్బాయికి ఏడేళ్లు - అమ్మాయికి తొమ్మిదేళ్లు దాటితే వారి వద్ద ఉంచుకోలేరు
- షరియా చట్టాల ప్రకారం వారసత్వ హక్కులు పొందలేరు. అన్నదమ్ములకు అందేమొత్తంలో మహిళలకు సగం మాత్రమే లభిస్తుంది.
- న్యాయస్థానాల్లో సైతం సరైన విచారణను పొందలేరు. ఒక పురుషుడు ఇద్దరు మహిళలతో సమానంగా ఉంటుంది.
- వ్యాపారం చేయకూడదు. ఒకవేళ లైసెన్స్ పొందాలన్నా - లోన్ కావాలన్నా ఇద్దరు పురుష అభ్యర్థులు ఆమె ప్రవర్తనను సర్టిఫై చేయాలి.