Begin typing your search above and press return to search.

కార్లు - ఏసీలు - సెల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

By:  Tupaki Desk   |   15 Jun 2017 9:27 AM GMT
కార్లు - ఏసీలు - సెల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌
X
గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ పొట్టిగా జీఎస్టీ వ‌ల్ల వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. జీఎస్టీ అమ‌లు గ‌డువు అయిన‌ జులై 1 ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో క‌స్ట‌మ‌ర్ల‌ను భారీ డిస్కౌంట్లు ఆక‌ర్షిస్తున్నాయి. ఈ కొత్త ప‌రోక్ష ప‌న్ను విధానం అమ‌ల‌య్యేలోపు త‌మ ద‌గ్గ‌ర ఉన్న పాత స్టాక్‌ ను వ‌దిలించుకోవ‌డానికి అన్ని సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి. దీంతో పేటీఎం ప్రీ జీఎస్టీ సేల్‌ ను ప్రారంభించింది. ఇందులో దేశవ్యాప్తంగా 6 వేల రీటెయిల‌ర్ల ద‌గ్గ‌ర ఉన్న 500 బ్రాండ్లు అమ్మ‌కానికి ఉన్నాయి. టీవీలు - మొబైల్ ఫోన్లు - ల్యాప్‌ టాప్స్‌ - ఏసీలు - ఫ్రిడ్జ్‌లు - ఫుట్‌ వేర్స్‌పై భారీ డిస్కౌంట్లు - క్యాష్‌ బ్యాక్ ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్‌ లైన్ రీటెయిల‌ర్లు తమ ద‌గ్గ‌ర ఉన్న స్టాక్‌ ను వ‌దిలించుకునేందుకు ఈ సేల్ బాగా పనికొస్తుంద‌ని పేటీఎం ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది.

మ‌రోవైపు మెడిక‌ల్ షాప్స్ కూడా డిస్కౌంట్లో మందులంటూ క‌స్ట‌మ‌ర్ల‌కు మెసేజ్‌ లు పంపిస్తున్నాయి. అన్ని ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ప్ర‌స్తుతం ఇదే ప‌నిలో ఉన్నాయి. 5 ల‌క్ష‌ల మ‌ర్చంట్లు ఉన్న షాప్‌ క్లూస్.కామ్ సేల్ గురించి క‌స్ట‌మ‌ర్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం ఇస్తున్న‌ట్లు తెలిపింది. సీజ‌న్ ఎండ్‌ లో ఉండే సేల్‌ ను చాలామంది రీటెయిల‌ర్లు ఒక నెల ముందుగానే ప్ర‌క‌టించారు. జీఎస్టీలోకి మారే ముందు పాత స్టాక్‌ తో ఎలాంటి త‌ల‌నొప్పులు ఉండ‌కూడ‌ద‌న్న కార‌ణంగా ఇలా డిస్కౌంట్ల‌కు వ‌స్తువుల‌ను అమ్మేస్తున్నారు. టాప్ పుట్‌ వేర్ బ్రాండ్ ప్యూమా ఫ్లాట్ 40 ప‌ర్సెంట్ ఆఫ‌ర్‌ తో పాటు అద‌నంగా ప‌ది శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఇక అలెన్ సోలీ కూడా బ‌య్ వ‌న్ గెట్ వ‌న్ ఆఫ‌ర్‌ ను ప్రారంభించింది. లివైస్ అయితే రెండు కొంటే రెండు ఫ్రీ అంటుంటే.. ఫ్ల‌యింగ్ మెషీన్ 50 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ఇస్తోంది. అటు మోటార్ సైకిల్స్‌ - కార్ల‌పైన కూడా కంపెనీలు డిస్కౌంట్లు ప్ర‌క‌టించాయి. బ‌జాజ్ ఆటో రూ.4500 వ‌ర‌కు డిస్కౌంట్ ప్ర‌క‌టించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/