Begin typing your search above and press return to search.

నా చావుకు మమతాబెనర్జీనే కారణం

By:  Tupaki Desk   |   25 Feb 2019 10:18 AM GMT
నా చావుకు మమతాబెనర్జీనే కారణం
X
1986వ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కోల్ కతా పోలీస్ ఉన్నతాధికారి గౌరవ్ దత్ ఫిబ్రవరి 19న ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కారణం బెంగాల్ సీఎం మమతాబెనర్జీనే కారణమంటూ సూసైడ్ నోట్ లో రాశాడు. ఇప్పుడీ సూసైడ్ నోట్ దుమారం రేపుతోంది.

మమతా బెనర్జీ తనకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టారని.. గత డిసెంబర్ 31న పదవీ విరమణ చేశాక కూడా తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను నిలిపివేశారని సూసైడ్ నోట్ లో దత్ ఆరోపించారు. నా చావుకు మమతా బెనర్జీయే కారణమని పేర్కొన్నారు.

ఇప్పుడీ సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. దత్ భార్య స్థానిక బీజేపీ నేత ముకుల్ రాయ్ తో కలిసి సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్ మండిపడ్డారు. వెంటనే మమతను అరెస్ట్ చేయాలని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బెంగాల్ చరిత్రలోనే సీఎం ఒత్తిడి వల్ల ఓ ఐపీఎస్ ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని అన్నారు.

మంగళవారం కోల్ కతా లోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న దత్ నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. చేతిని కట్ చేసుకొని రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి భార్య షాక్ కు గురైంది. ఇప్పటికే సీబీఐతో నువ్వా నేనా అన్నట్టు ఫైట్ చేస్తున్న మమతకు ఐపీఎస్ ఆత్మహత్య మెడకు చుట్టుకున్నట్టైంది. ప్రస్తుతం కోల్ కతా వాతావరణం ఆందోళనకరంగా ఉంది.