Begin typing your search above and press return to search.
సామాన్యుడి తాజ్ మహల్ కి సీఎం సాయం!
By: Tupaki Desk | 21 Aug 2015 10:07 AM GMTతాజ్ మహాల్ గురించి తెలియంది ఎవరికి. మొఘల్ చక్రవర్తి షాజ్ హాన్ తన ముద్దుల భార్య స్మృతికి చిహ్నంగా అద్భుత కట్టడాన్ని కట్టించటం తెలిసిందే. ప్రపంచ వింతల్లో ఒకటిగా కీర్తిని అందుకున్న ఈ కట్టడం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అలాంటి తాజ్ మహాల్ ను మళ్లీ కట్టించాలన్న ఉద్దేశంతో రంగంలోకి దిగాడు ఓ సామాన్యుడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య మరణాన్ని తట్టుకోలేని ఆయన తన స్థాయిలో తాజ్ మహాల్ ను రూపొందించాలని నడుం బిగించాడు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఫైజుల్ ఖాద్రి ఒక రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. 1953లోనే ఇతగాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె.. 2011లో క్యాన్సర్ తో మరణించారు. ప్రస్తుతం ఏనభై ఏళ్ల వయసులో ఉన్న ఖాద్రి.. తన భార్య స్మృతి చిహ్నంగా ఏదైనా కట్టడాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు.. మరో తాజ్ మహాల్ ను నిర్మించాలని భావించిన ఆయన.. తన భార్య నగల్ని..భూమిని అమ్మేశాడు. ఇప్పటికి రూ.11లక్షలు ఖర్చు చేసి తన తాజ్ మహాల్ ను నిర్మించసాగాడు.
అయితే.. ఆర్థిక సమస్యల కారణంగా నిర్మాణం ఆగిపోయింది. అతగాడి కలల తాజ్ మహాల్ నిర్మాణం పూర్తి కావాలంటే మరో ఆరేడు లక్షల రూపాయిలు అవసరమవుతాయి. అయితే.. ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు అతనికి సాయం చేయటానికి ముందుకొచ్చారు. చివరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సైతం.. ఖాద్రి ప్రేమ వ్యవహారం విని కదిలిపోయి.. ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారట. అంత వయసులో అతగాడి ప్రేమ సీఎంను కదిలించేసిందట.