Begin typing your search above and press return to search.

కామపిశాచికి నిలువెత్తు రూపం.. ఈ మాజీ జైలు అధికారిణి

By:  Tupaki Desk   |   5 July 2021 2:31 AM GMT
కామపిశాచికి నిలువెత్తు రూపం.. ఈ మాజీ జైలు అధికారిణి
X
విన్నంతనే ఉలిక్కిపడేలా ఉండటమే కాదు..కొన్నిసార్లు ఏ మాత్రం నమ్మశక్యం కాని రీతిలో ఉండే ఉదంతాలు బయటకు వస్తుంటాయి.తాజా ఉదంతం ఆ కోవలోకి చెందిందే. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక మహిళా అధికారిణి.. కలలో కూడా ఊహించనలేని బరితెగింపును ప్రదర్శించటమే కాదు.. ఆమె చేసిన చేష్టల గురించి తెలుసుకున్న న్యాయమూర్తి సైతం షాక్ తిన్న వైనం ఈ ఉదంతంలో కనిపిస్తుంది. నిత్యం కామదాహంతో రగిలిపోతూ.. జైల్లో ఉన్న ఖైదీలతో ఇష్టారాజ్యంగా సెక్సు చేయించుకోవటమే కాదు.. కండిషన్లు పెట్టి మరీ సెక్సు టార్చర్ పెట్టిన ఆమె తీరుకు వణికిపోవటమే కాదు.. ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

ఇంతకీ ఆమె ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రెస్నో కౌంటీ జైల్లో పురుష ఖైదీల పర్యవేక్షకు ఒక అధికారిణిగా నియమించారు. సాధారణంగా ఇలాంటి పోస్టులకు ఒక మహిళా అధికారిణిని ఎంపిక చేసినప్పుడు వారు కాస్తా ఇబ్బందికి గురవుతారు. పురుష ఖైదీలను పర్యవేక్షించటం సామాన్యమైన విషయం కాదని.. కత్తి మీద సాములాంటిదన్నట్లు ఉంటుంది. అందుకు భిన్నంగా ఆ పురుష ఖైదీలో హాహాకారాలు చేసేలా వ్యవహరించిన ఆమె తీరు జీర్ణించుకోలేనిదిగా ఉంటుంది. 27 ఏళ్ల టీనా గోన్జలెజ్ తన విధి నిర్వహణలో చేయాల్సిన డ్యూటీని వదిలేసి.. సెక్సు డ్యూటీ చేసేది. తీవ్రమైన విరహజ్వాలతో రగిలిపోయే ఆమె.. ఖైదీలను తనతో సెక్సు చేయాలని విపరీతమైన ఒత్తిడికి గురి చేసేది.

ఆమె వేధింపులకు హడలిపోయిన ఖైదీలు ఫిర్యాదులు చేశారు. వారి కంప్లైంట్లలో ఆమె తమను ఎలా సెక్సు టార్చర్ పెట్టేదో వివరంగా వెల్లడించారు. తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఒకరితో సెక్సు చేస్తూనే.. చుట్టూ ఉన్న వారు తనను కన్ను ఆర్పకుండా చూడాలన్నకండీషన్ పెట్టేది. అంతేకాదు.. పోర్న్ వీడియోలు చూపించి అందులో మాదిరి తనకు చేయాలని ఒత్తిడి చేసేది. శృంగారంలో పాల్గొనటానికి వీలుగా తన యూనిఫామ్ కు ఆమె రంధ్రాలు చేసుకొని మరీ వచ్చేదని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.

ఖైదీలతో ఆమె కామ పురాణం.. ఆమె వ్యవహరించే తీరు గురించి తెలుసుకున్న జడ్జి సైతం షాక్ తిన్నట్లు చెబుతారు. ఆమెను కామపిశాచిగా అభివర్ణించటం గమనార్హం. ఆమె మీద వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించటమే కాదు.. విచారణ కమిటీని వేశారు. అందులోనూ ఆమె దారుణాల గురించి పేర్కొన్నారు. తాను చెప్పినట్లు సెక్సు చేసిన ఖైదీలకు రిటర్న్ గిప్టులుగా సెల్ ఫోన్లు.. మద్యం.. డ్రగ్స్ ను అందించేవారని తేల్చారు. ఇందుకు సెక్స్ రిటర్న్ గిప్గులుగా ఆమె పేర్కొనేవారిని వెల్లడైంది. ఆమె మీద వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి ఖైదు చేశారు.

ఈ కేసు విచారణకు తాజాగా న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఆమె తరఫు లాయర్.. ఆమె చేసిన పనుల గురించి ప్రస్తావిస్తూ.. ఆమె వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసిందని..ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని.. ఆమె మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని క్షమించాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆమెకు మూడేళ్ల ఎనిమిది నెలలు జైలుశిక్ష విధించారు.

తీర్పు ఇచ్చే సమయంలో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. మూర్ఖంగా వ్యవహరించావు. ఇకనుంచైనా మంచిగా జీవించు’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అండర్ ట్రయల్ ఖైదీగా రెండేళ్లుగా జైల్లో ఉన్నారు. మొత్తం శిక్షా కాలంలో ఆ రెండేళ్లను మినహాయించి మిగిలిన కాలాన్ని జైల్లో ఉంచాలని పేర్కొన్నారు. ఒకప్పుడు ఏ జైలుకు అయితే అధికారిణిగా ఉన్నారో.. ఇప్పుడు అదే జైల్లోఆమె ఖైదీగా ఉండటం గమనార్హం.