Begin typing your search above and press return to search.
కేసీఆర్ తో స్నేహం వల్లే జగన్ చెడిపోతున్నాడు
By: Tupaki Desk | 28 Jan 2020 4:45 AM GMTఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానంపై తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనమండలిని రద్దు చేసిన జగన్ ప్రభుత్వం చర్యను రేవంత్ రెడ్డి ఖండించారు.
జగన్ ప్రభుత్వం మండలిని రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ పరిణామాలు చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదం పొంద లేదన్న కారణం తో సభను రద్దు చేయడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు.
ఎన్ని రాజధానులు ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలకు పట్టుదల ఉండడం మంచిదే కానీ.. మొండితనం మంచిది కాదని రేవంత్ రెడ్డి హితవు పలికారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్నేహం వల్లే జగన్ కు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయన్న అనుమానం కలుగోందని.. కేసీఆర్ వల్లే జగన్ చెడి పోతున్నారేమోనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తో జగన్ కు స్నేహం అంత మంచిది కాదన్నారు. తనను నమ్మిన అందరినీ కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.