Begin typing your search above and press return to search.
ఆ పార్టీ నుంచి ఈటెల : గజ్వేల్ పోటీ మీద రేవంత్ మార్క్ షాక్...?
By: Tupaki Desk | 13 July 2022 4:30 PM GMTతెలంగాణా రాజకీయాల్లో హాట్ హాట్ కామెంట్స్ అలా వచ్చి పడుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ మేరకు చూస్తే ఏణ్ణర్ధం టైం కూడా గట్టిగా లేదు. మరో వైపు కేసీయార్ సర్కార్ మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి ఏకంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సీట్లు గజ్వేల్ లో ఓడించి తీరుతామని నిన్నటి టీయారెస్ నేత, నేటి బీజేపీ ఎమ్మెల్యే అయిన ఈటెల రాజేందర్ బిగ్ సౌండ్ చేశారు.
కేసీయార్ గుట్టూ మట్టూ అన్నీ తనకే తెలుసు కాబట్టి గజ్వేల్ నుంచి ఆయన్ని ఓడించి ఇంటికి పంపుతామని కూడా గట్టి ధీమా ప్రదర్శించారు. దానికి ఆయన పశ్చిమ బెంగాల్ ఉదాహరణ తెచ్చారు. అక్కడ బెంగాల్ టైగర్ గా ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ తరఫున సువేందు అధికారి ఓడించేశారు. ఆ తరువాత ఉప ఎన్నికలు పెట్టించుకుని మరీ మమత గెలిచేవారూ నానా హైరానా పడిపోయారు.
ఇపుడు అలాగే కేసీయార్ ని తాను ఓడిస్తాను అంటూ ఈటెల బయల్దేరారు. అయితే ఆయన ఏ పార్టీనో అన్న సంగతి చెప్పలేదు అంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నా ఆయన అక్కడ చాలా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఈటెల మాజీ మంత్రి, రెండు దశాబ్దాల పాటు తెలంగాణా రాష్ట్ర సమితిలో ఉంటూ తెలంగాణా ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. ఒక విధంగా చూస్తే ఉద్యమ కారుడు.
పైగా బీసీ నేత. అలాంటి ఈటెల రాజెందర్ సేవలను బీజేపీ సక్రమంగా వాడుకోవడంలేదన్న బాధ అయితే ఆయన అనుచరులలో ఉంది. గుంపులో గోవిందం మాదిరిగా ఆయన్ని చూడడం పట్ల వారంతా బాధపడుతున్నారు. ఈ పరిణామాలతో ఆయన ఎన్నికల వేళకు కాంగ్రెస్ లోకి వెళ్ళి గజ్వేల్ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈటెల మీద జరుగుతున్న ప్రచారం నిజమే అన్నట్లుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా చేసిన ఒక ప్రకటన కూడా ఇపుడు బీజేపీలో అగ్గి రాజేస్తోంది.
కేసీయార్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన్ని ఓడించడం ఖాయం. అయితే ఆ ఓడించేది మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి సుమా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. గజ్వేల్ లో కాంగ్రెస్ అభ్యర్ధి మాత్రమే కేసీయార్ ని ఓడిస్తారు అని అంటున్నారు. మరి ఈటెల చూస్తే తాను కేసీయార్ ని ఓడిస్తాను అని చెబుతూనే ఏ పార్టీ అన్నది సస్పెన్స్ లో ఉంచేస్తే దానికి కొనసాగింపుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధితోనే కేసీయార్ ని ఓడిస్తామని చెప్పుకొచ్చారు.
దీన్ని బట్టి ఈటెలను కాంగ్రెస్ లోకి తీసుకుని ఆయనతోనే కేసీయార్ ని ఓడిస్తామని రేవంత్ చెప్పకనే చెప్పినట్లు అయింది అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఈటెల రాజేందర్ గజ్వేల్ లో గేల్వడానికి రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా సాయం చేశారన్న అభిమానం ఈటెలకు ఉదని అంటున్నారు. డమ్మీ అభ్యర్ధిని అక్కడ నిలిపి ఈటీల గెలిచాలా చేసినందుకు రేవంత్ పట్ల ఆయనకు అభిమానం ఉంది అంటున్నారు.
దాంతో పాటు తెలంగాణాలో టీయారెస్ ని ఢీ కొట్టే పార్టీగా కాంగ్రెస్ మాత్రమే ఉందని కూడా ఈటెల భావిస్తున్నారు అని చెబుతున్నారు. దాంతో ఇపుడు కాకపోయినా ఎన్నికలకు దగ్గర చేసి అయినా కాంగ్రెస్ తీర్ధాన్ని ఈటెల పుచ్చుకుంటారు అన్న ప్రచారం అయితే గట్టిగానే సాగుతోంది. దీని మీద మాత్రం బీజేపీలో రకరకాలైన ఆలోచనలు సాగుతున్నాయి. అలాంటిది ఏదీ లేదని, ఈటెల మా వైపే ఉంటారని, రేవంత్ రెడ్డి బీజేపీ జోష్ ని హుషార్ ని తగ్గించడానికి ఈ తరహా చీప్ ట్రిక్స్ ని వాడుతున్నారని కమలనాధులు అంటున్నారు.
తొందరలోనే ఈటెలకు మంచి పదవి ఇస్తారని కూదా బీజేపీ వారు చెబుతున్నారు. అయితే బీజేపీలో చేరికల కమిటీకి చైర్మన్ గా ఈటెలను నియమించినా ఆయన ఏ మాత్రం సంతోషంగా లేరు అని అంటున్నారు. చూడాలి మరి ఈటెల బీజేపీలో ఉంటారా. ఆయన ఉండేలా కమలనాధులు చూసుకుంటారా లేక రేవంత్ చెప్పినట్లే జరుగుతుందా. అసలు ఈటెల మనసులో ఏముంది, ఎవనీ తెలియాలీ అంటే కొంత సమయం గడవాల్సిందే అంటున్నారు.