Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి ఫాంహౌస్ రాజకీయం.. ఎంత పని చేసింది?

By:  Tupaki Desk   |   16 Jun 2020 3:00 PM GMT
రేవంత్ రెడ్డి ఫాంహౌస్ రాజకీయం.. ఎంత పని చేసింది?
X
హైదరాబాద్ శివారులో కేటీఆర్ ఫాంహౌస్ పై భీకరపోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డిపై మొన్నటిదాకా టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు అందరూ సైలెంట్ అయ్యారు. ఈ మౌనం వెనుక అంతుచిక్కని వ్యూహం ఉందని గులాబీ నేతలు అంటున్నారు.

కేటీఆర్ పై తాజాగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నా కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పుడు నోరు మెదపకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ పరిణామం కాంగ్రెస్ నేతలను కూడా ఆలోచనలో పడేశాయి. ఎందుకు టీఆర్ఎస్ నేతలు రేవంత్ ఆరోపణలపై స్పందించడం లేదన్నది హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ సర్కార్ ఇచ్చిన 111 జీవోకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోరాడారు. కేటీఆర్ ఫాంహౌస్ అలానే అక్రమంగా కట్టారన్నారు. ఇప్పుడు ఇదే జీవోపై హైదరాబాద్ లో ఎక్కువ నిర్మాణాలు కాంగ్రెస్ నేతలకే ఎక్కువ ఉన్నాయని టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిందట.. జీవో పరిధిలో ఎక్కువ ఫాంహౌస్ లు కాంగ్రెస్ లీడర్లకే ఉన్నాయని సమాచారం తెప్పించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వారందరికీ నోటీసులు జారీ చేసి కూల్చాలని ప్రయత్నాలు చేస్తోందట.. ఇప్పుడు రేవంత్ కదిపిన 111 జీవో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేద్దామని 111 జీవో తెస్తే ఇప్పుడు అదే తమ పాలిట పెను అస్త్రంగా మారిందని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారట.. రేవంత్ చేసిన పనికి ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ లు చాలా ధ్వంసమయ్యే ప్రమాదంలో పడ్డాయట.. దీంతో రేవంత్ రెడ్డిని సైలెంట్ గా ఉండమని కాంగ్రెస్ సీనియర్లంతా హెచ్చరిస్తున్నారట..

టీఆర్ఎస్ సర్కార్ కావాలనే ఈ కేటీఆర్ ఫాంహౌస్ తో కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ లు కూల్చాలని ఈ స్కెచ్ వేసినట్టు కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారట.. రేవంత్ రెడ్డిని ఇందులో బుక్ చేశారని అనుకుంటున్నారట.. రేవంత్ ప్రజాసమస్యలను వదిలేసి ఇలా ఫాంహౌస్ ను పట్టుకొని తమ కొంప ముంచాడని అతడిపై కారాలు మిరియాలు నూరుతున్నారట కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ స్టాటజీకి రేవంత్ తోపాటు కాంగ్రెస్ నేతలు బుక్కయ్యారని అంటున్నారు.