Begin typing your search above and press return to search.
రేవంత్ సీఎం .? కాంగ్రెస్ పోస్టుమార్టం హీట్
By: Tupaki Desk | 30 Oct 2019 5:59 AM GMTఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నాడట.. అధికారం లేదు.. విజయాలు లేవు.. అయినా కూడా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు.. అయితే కాంగ్రెస్ అంటే కప్పల తక్కడ. అదో మహాసముద్రం. అన్ని కాలువలు, నదులు పోయి కాంగ్రెస్ లో కలువాల్సిందే కానీ.. కాంగ్రెస్ సంద్రం మాత్రం ఎదురేగి బయటకు రాదు..
అయితే తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఎంతో మంది సీఎంలున్నారు. నేతలు ఎక్కువ.. నడిపించే నాయకులు తక్కువ. అదే సమస్యగా మారుతోంది. ఆధిపత్యానికి దారితీస్తోంది. పార్టీలో గ్రూపులతో ఓడిపోయేలా చేస్తోంది.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలంతా హైదరాబాద్ లో భేటి అయ్యారు. ఈ భేటి ప్రధానంగా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ఓటమి-భవిష్యత్ కార్యాచరణపైనే జరిగిందట.. హుజూర్ నగర్ లో దారుణ ఓటమికి బాధ్యత నాదేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఒప్పేసుకున్నారట.. బాధపడ్డారట. అయితే అంతటితో కథ అయిపోలేదు..
అప్పుడే మన సీనియర్ సిటీజన్, కాంగ్రెస్ వృద్ధ నేత వీ హనుమంతరావు లేచి అందుకున్నారట. ‘అరే హుజూర్ నగర్ లో ప్రచారంలో కూడా పాపులారిటి కోసం పాకులాడడు ఏందిరా బై.. సభలో అంతా సీఎం సీఎం అని ఆ నేతను అంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం అని అనిపించుకోలేదు’ అంటూ ఫైర్ అయ్యాడట.. వీహెచ్ పరోక్షంగా అన్నది రేవంత్ రెడ్డి ప్రచార ఆర్భాటం గురించేనట.. అయితే రేవంత్ మాట అనకుండా వీహెచ్ ఈ కాంగ్రెస్ మీటింగ్ లో కడిగిపారేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ఇటీవల హుజూర్ నగర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటే ఆయన అభిమానులు ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ నేతలందరి ముందు హోరెత్తించారట.. ఇది చూసిన వీహెచ్ సహా మిగతా సీనియర్లు అప్పుడే గుర్రుగా ఉన్నారట.. ఇక మన సీనియర్ వీహెచ్ ఊరుకుంటాడా..? దాన్ని కాంగ్రెస్ పోస్టుమార్టంలో అననే అనేశాడు..