Begin typing your search above and press return to search.
రేవంత్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన కేటీఆర్.. ఆడియో క్లిప్ తో సారీ చెప్పక తప్పలేదు
By: Tupaki Desk | 17 Sep 2021 4:30 AM GMTఆవేశం మంచిదే కానీ అన్ని సందర్భాల్లోనూ సరి కాదు. తొందరపాటుతో చేసే వ్యాఖ్యలకు తర్వాతి వేళలో చింతించాల్సి ఉంటుంది. తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల ఐటీ స్టాడింగ్ కమిటీ ఛైర్మన్ శశిథరూర్ తన టీంతో కలిసి హైదరాబాద్ కు వచ్చారు. ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రశంసించారు. అయితే.. సీనియర్ కాంగ్రెస్ నేత పర్యటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్ కు లేదు.
కాంగ్రెస్ సీనియర్ నేత తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడిన వైనాన్ని కేటీఆర్ గొప్పగా పేర్కొనటంతో రేవంత్ రెడ్డి ఆవేశంతో రియాక్టు అయ్యారు. ఒక మీడియా ప్రతినిధి రేవంత్ కు ఫోన్ చేయగా.. ఆయన ఆవేశంగా మాట్లాడుతూ.. శశిథరూర్.. కేటీఆర్ ఇద్దరూ గాడిదలేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి సంబంధించి సీనియర్ నేత అయిన శశిథరూర్ లాంటి వారిపై వెనుకా ముందు చూసుకోకుండా తీవ్ర వ్యాఖ్యలు చేయటం వివాదంగా మారింది.
దీన్ని అవకాశంగా తీసుకున్న మంత్రి కేటీఆర్ రేవంత్ పై విమర్శల వర్షం కురిపించారు. సొంత పార్టీ నేతను ఇష్టానుసారం వ్యాఖ్యానించినట్లుగా పేర్కొన్న రేవంత్ వ్యాఖ్యల్ని రేవంత్ కొట్టిపారేశారు. తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా కేటీఆర్ చేసిన ట్వీట్ అసత్యమని ఎదురుదాడి చేశారు. ఎర వేసి అడ్డంగా బుక్ చేసిన రీతిలో మంత్రి కేటీఆర్ తన చేతిలోని అస్త్రాన్ని ప్రయోగించారు.
తనను.. సొంత పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ను గాడిదలతో పోల్చటంతో పాటు.. శశిథరూర్ లాంటి వారిని పార్టీ నుంచి బహిష్కరంచాలన్న కామెంట్ ఆడియోలో ఉంది. ఆ క్లిప్ ను చివరి అస్త్రంగా.. రేవంత్ తిట్టిన తిట్లతో కూడిన ఆడియో క్లిప్ ను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో.. రేవంత్ అడ్డంగా బుక్ అయ్యారు. అప్పటివరకు మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడిన రేవంత్.. ఒక్కసారిగా తగ్గారు. శశిథరూర్ కు ఫోన్ చేసి స్వయంగా మాట్లాడారు. సారీ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలకు చింతించినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు.
అందులో.. ‘‘ఎంపీ శశిథరూర్‌తో ఫోన్లో మాట్లాడాను. ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా. శశిథరూర్‌ను అత్యంత గౌరవించే వ్యక్తిని నేను. ఆ వ్యాఖ్యలపై శశిథరూర్‌కు వివరణ ఇచ్చాను. జరిగిన దాని పట్ల చింతిస్తున్నా. కాంగ్రెస్‌లో విధానాలు, విలువలతో పనిచేస్తాం. వచ్చే తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అందరం కలిసి కృషిచేస్తాం’’ అని పేర్కొన్నారు. మొత్తంగా వివాదానికి వీలైనంత వేగంగా పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్లే శశిథరూర్ సైతం ట్విట్టర్ లో స్పందించారు. రేవంత్ తనకు కాల్ చేసి.. జరిగిన దానికి చింతిస్తున్నట్లు చెప్పి.. క్షమాపణలు తెలిపారన్నారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిందని.. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని శశిథరూర్ ట్వీట్ చేశారు.
సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతతో ప్యాచప్ చేసుకోవటంలో రేవంత్ అంతో ఇంతో సక్సెస్ అయినా.. జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది. ముందు తాను తిట్టలేదని చెప్పి.. మంత్రి కేటీఆర్ ఆడియో క్లిప్ విడుదల చేసిన తర్వాత తప్పు ఒప్పుకోవటంతో పాటు.. సారీ చెప్పటంతో భారీ డ్యామేజ్ జరిగిపోయింది. ఫైర్ బ్రాండ్ డిఫెన్సు పడిన వైనంతో మంత్రి కేటీఆర్ మరింతగా చెలరేగిపోయారు. తాను ట్వీట్ చేసిన ఆడియో క్లిప్ పై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. శశిథరూర్ పై రేవంత్ చేసిన కామెంట్స్ ను ఒక రిపోర్టర్ తనకు పంపారన్న మంత్రి కేటీఆర్.. ఒకవేళ ఆ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే.. ఇది ఓటుకు నోటు ఆడియోలోని రేవంత్ రెడ్డి వాయిస్ తో మ్యాచ్ అవుతుందన్న ఆయన.. ఈ ఆడియో క్లిప్ పై రాహుల్ గాంధీ స్పందిస్తారా? అని ప్రశ్నించారు. థర్డ్ రేట్ క్రిమినల్ కు పార్టీ సారథ్య బాధ్యతల్ని అప్పగిస్తే ఇలానే ఉంటుందని కేటీఆర్ విమర్శించి వైనంలో రేవంత్ కు భారీ ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు. రాక రాక వచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా వాడేసిన మంత్రి కేటీఆర్.. ఈ ఎపిసోడ్ లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించారని చెప్పక తప్పదు.