Begin typing your search above and press return to search.
కేసీఆర్ ‘దళితబంధు’కు రేవంత్ కౌంటర్ ప్లాన్ ఇదే
By: Tupaki Desk | 26 July 2021 7:30 AM GMTహుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ మరో అస్త్రాన్ని బయటకు తీశారు. ఎస్సీలను ఆకట్టుకునేలా ‘దళితబంధు’ను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణలోని దళితులను ఆకర్షించేలా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. దళిత ఓటర్ల అభిమానాన్ని పొందేందుకు చేయాల్సినవన్నీ చేస్తున్నారు.
అధికారంలో ఉన్న పార్టీగా టీఆర్ఎస్ కు అనేక వనరులున్నాయి. దానికి తగ్గట్టుగా కేసీఆర్ ప్రజలపై వరాల వాన కురిపిస్తున్నారు. దళిత కుటుంబానికి ఒక్కంటికి రూ.10 లక్షలు అకౌంట్లో వేస్తానని.. తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తానని చెబుతున్నారు.
కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలోని దళిత సామాజికవర్గం , నేతలు కూడా టీఆర్ఎస్ కు ఆకర్షితులవుతున్నారు. దీంతో కేసీఆర్ వ్యూహాలకు విరుగుడుగా ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. కేసీఆర్ ఎన్నికలకు ముందే దళితుల అకౌంట్లో రూ.10లక్షలు వేస్తే హుజూరాబాద్ లో ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపు గాలి మళ్లొచ్చు అంటున్నారు. అది ఈటలకు వ్యతిరేకంగా సాగవచ్చని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సైతం కేసీఆర్ వరాలపై అలెర్ట్ అయ్యింది. దళితులను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. సీఎం కేసీఆర్ వేసిన ‘దళిత బంధు’కు పోటీగా ‘ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్’ అంశాన్ని హైలెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి ఇప్పటికే దళిత గిరిజనులతో ఓ సభ నిర్వహించి కేసీఆర్ పై విమర్శలు చేశారు.
ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు దళిత నేత అయిన దామోదరనే రూపకర్తగా ఉన్నారట.. దీంతో ఆ నిధులు దళిత వర్గాలకే అందుతాయని.. దామోదరకు ఆదరణ ఉంటుందని రేవంత్ రెడ్డి ఈ ప్లాన్ చేశారు.
ప్రస్తుతం కేసీఆర్ కు కౌంటర్ గా కాంగ్రెస్ దించిన ‘ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్’ ఏమేరకు వర్కవుట్ అవుతుందనేది వేచిచూడాలి.