Begin typing your search above and press return to search.

కేటీయార్ గాలి తీసేసిన రేవంత్

By:  Tupaki Desk   |   15 Sep 2021 11:30 PM GMT
కేటీయార్ గాలి తీసేసిన రేవంత్
X
ఇందుకనే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డంటే జనాల్లో ఇంత క్రేజుంది. ప్రత్యర్ధులపై సూటిగా సుత్తిలేకుండా విరుచుకుపడటమే రేవంత్ స్పెషాలిటి. తాజాగా మంత్రి కేటీయార్ పై ఇలాగే విరుచుకుపడ్డారు. రేవంత్ వేసిన సూటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక కేటీయార్ గిలగిల్లాడిపోతున్నారిపుడు. ఇంతకీ విషయం ఏమిటంటే సింగరేణి కాలనీలోని 6 ఏళ్ళ చిన్నారిపై రాజు అనే యువకుడు హత్యాచారం చేయటం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

ఈ విషయంలోనే కేటీయార్ గాలిని రేవంత్ తీసేశారు. కారణం ఏమిటంటే బాలికపై హత్యాచారం చేసిన నిందితుడు రాజు పోలీసుల అదుపులోనే ఉన్నాడని కేటీయార్ ట్వీట్ చేశారు. నిందితుడిపై కఠినమైన శిక్షలు వేయాలని హోంమంత్రి, డీజీపీలను కేటీయార్ తన ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఇపుడిదే విషయాన్ని రేవంత్ గట్టిగా పట్టుకున్నారు. ఒకవైపు రాజును పట్టించిన వారికి రు. 10 లక్షల బహుమానం ప్రకటించింది పోలీసుశాఖ. మరోవైపు రాజు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు కేటీయార్ ట్వీట్ చేశారు.

ఈ రెండింటిలో ఏది నిజమో చెప్పాలని రేవంత్ ఇటు పోలీసులను అటు కేటీయార్ ను మీడియా సమావేశంలో నిలదీశారు. అయితే రేవంత్ మీడియా సమావేశం పెట్టి వాయంచేసే సమయానికి కేటీయార్ తన ట్వీట్ ను డిలిట్ చేసేశారు. తాను తప్పుగా ట్విట్ చేసినట్లు కేటీయార్ ఒప్పుకున్నారు. అయితే రేవంత్ మాత్రం అంగీకరించకుండా ట్వీట్ పెట్టినపుడు కేటీయార్ ఏమన్నా మత్తులో ఉన్నాడా ? అంటు సందేహం వ్యక్తంచేశారు.

మహిళలపై జరుగుతున్న దాడులకు మద్యమే కారణమని రేవంత్ మండిపోయారు. ఈఏడాదిలో ఇఫ్పటివరకు 1750 అత్యాచార ఘటనలు జరిగినట్లు రేవంత్ చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగటానికి మద్యం, డ్రగ్సే ప్రధాన కారణంగా మండిపడ్డారు. ఈనెల 17వ తేదీన రాష్ట్రానికి వస్తున్న హోంశాఖ మంత్రి అమిత్ షా తనకు అపాయిట్మెంట్ ఇస్తే రాష్ట్రంలో పరిస్ధితులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.