Begin typing your search above and press return to search.

రేవంత్ ఓ ఐర‌న్ లెగ్‌... బీజేపీ, టీఆర్ఎస్‌, టీడీపీయే ఉదాహ‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   23 April 2022 4:30 PM GMT
రేవంత్ ఓ ఐర‌న్ లెగ్‌... బీజేపీ, టీఆర్ఎస్‌, టీడీపీయే ఉదాహ‌ర‌ణ‌
X
టీపీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్‌రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆ పార్టీ పాల‌న‌పై విరుచుక‌ప‌డుతుంటారు. అయితే, దానికి త‌గిన‌ట్లే టీఆర్ఎస్ నేత‌ల‌తు సైతం రియాక్ట‌వుతుంటారు.

తాజాగా తెలంగాణ‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీపీసీసీ ఛీఫ్ పై విరుచుకుప‌డ్డారు. వరంగల్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ భూస్థాపితమేనని విమర్శించారు. రేవంత్ పొలిటిక‌ల్ కెరీర్ ప్రారంభ‌మైన నాటి నుంచి నేటివ‌ర‌కు ఉన్న ప‌రిస్థితులే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు.

రేవంత్‌ బీజేపీలో ఉన్న సమయంలో ఆ పార్టీ పుంజుకోలేద‌ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వ్యాఖ్యానించారు. అనంత‌రం రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరార‌ని పేర్కొన్న ఎర్ర‌బెల్లి...ఆయ‌న పార్టీ నుంచి వెళ్లగానే టీఆర్ఎస్‌ బాగుపడిందన్నారు. టీఆర్ఎస్ అనంత‌రం టీడీపీలో రేవంత్ రెడ్డి చేరార‌ని గుర్తు చేసిన ఎర్ర‌బెల్లి ఆయ‌న నాయ‌క‌త్వంలో టీడీపీ ఖతమైందని ఆరోపించారు.

ఇక కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి రాక ముందుకు కొన్ని సీట్లు వచ్చాయని.. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే కాంగ్రెస్‌కు వచ్చేవి సున్నా స్థానాలేనని, ఇది రాసిపెట్టుకోవాలన్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి ఓ ఐర‌న్ లెగ్ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ కోసం రేవంత్ చేసింది ఏమైనా ఉందా? అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌శ్నించారు. టీడీపీలో ఉన్న స‌మ‌యంలో తాము తెలంగాణ కోసం కొట్లాడుతుంటే.. రేవంత్‌ చంద్రబాబు ఏజెంట్‌గా పని చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌లోనే రేవంత్‌కు ఎవరూ విలువనివ్వడం లేదని, బయట ఇంకెవ్వరైనా ఇస్తారా ? అని ప్రశ్నించారు.

సిగ్గు లేకుండా రైతు సంఘర్షణ పేరిట సభ పెడుతున్నారని, ముందు కాంగ్రెస్‌లో కొట్టుకు చస్తున్న వారి సంగతి చూడు అంటూ హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ ధీనమైన స్థితిలో ఉందని, ఆ పార్టీ శవయాత్ర జరుగుతోందన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏంటో తెలిసిందన్నారు.