Begin typing your search above and press return to search.
కేసీఆర్ దత్తత తీసుకున్నలక్ష్మాపూర్ అలా ఉందట
By: Tupaki Desk | 24 May 2022 2:41 AM GMTఆడంబరంగా ప్రకటనలు చేయటం.. ఆదర్శాలకు కేరాఫ్ అడ్రస్ గా అభివృద్ధి చూపిస్తానంటూ తియ్యటి మాటలు చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు.. చేతలకు మధ్య తేడాను చూపించేందుకు తెగ తాపత్రయపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. ఈ మధ్యనే విజయవంతంగా నిర్వహించిన వరంగల్ సభతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు రేవంత్. వరంగల్ డిక్లరేషన్ పేరుతో తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామన్న విషయాల్ని స్పష్టంగా తెలియజేసిన ఆయన.. తమ హామీల్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
తాము ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని.. రాష్ట్రంలో 84 వేల మంది రైతులు చస్తే ఎవరిని పలుకరించని ఆయన.. తెలంగాణ ప్రజల పన్నులతో వచ్చిన పైసల్ని తీసుకెళ్లి పంజాబ్ లో పంచుతున్నడని మండిపడ్డారు. కేసీఆర్ కు ఎంతసేపు రాజకీయం తప్పించి ప్రజల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు. ‘‘సీఎం కేసీఆర్..లక్ష్మి పూర్ గ్రామన్ని ఐదేళ్ల కింద దత్తత తీసుకున్నడు. ఈ గ్రామం నుంచి ధరణి పోర్టల్ ప్రారంభించిండు. లక్ష్మాపూర్ గ్రామ రెవెన్యూ నక్ష్య లేదు. 582 మంది కి ఖాతా బుక్ లేదు.. రైతుబంధు లేదు , రైతుబీమా లేదు. అధికార యంత్రాంగానికి పదే పదే చెప్పిన సమస్య పరిష్కారం కావడం లేదు’’ అని మండిపడ్డారు. లక్ష్మాపూర్ లో కుమ్మరి ఎల్లవ్వ ఇంటిని ముంచి .. కేసీఆర్ ఫాంహౌస్ కు రోడ్డు వేసుకున్నడని.. ప్రభుత్వం ఆమెకు ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ సీఎం కేసీఆర్ ఆమెను ఆదుకోకుంటే.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇల్లు కట్టించి ఆమెకు ఇస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రానున్న పన్నెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. వచ్చినంతనే లక్ష్మాపూర్ భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు. వడ్డు కొనకుండా కేసీఆర్ ప్రభుత్వం దళారులకు వదిలేసిందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంతనే వడ్లను రూ.2500 పెట్టి కొనుగోలు చేస్తామన్నారు.
వరంగల్ డిక్లరేషన్ మేరకు ధరలు చెల్లించి పంట కొనుగోలు చేస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా చాలామంది నేతలు ఆరోపణలు చేస్తుంటారు. కానీ.. వాటిని ఉదాహరణలతో సహా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పడేయటం చాలా తక్కువ మంది చేస్తుంటారు. ఫైర్ బ్రాండ్ రేవంత్ ను చూస్తే.. ఆరోపణలు చేయటమే కాదు.. వాటి ఆధారాల్ని చూపిస్తూ ప్రజల్లోకి వెళ్లటం ద్వారా కేసీఆర్ సర్కారును ఇరుకున పడేస్తున్నారు. మరి ఆయన మాటలు.. తెలంగాణ ప్రజానీకాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం మరికొద్ది నెలల్లోనే తేలిపోతుందని చెప్పక తప్పదు.