Begin typing your search above and press return to search.
మంత్రి బండారం మొత్తం బయటపెట్టేసిన రేవంత్
By: Tupaki Desk | 27 Feb 2017 3:47 PM GMTఇన్నాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా మంత్రులను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. గృహనిర్మాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. జాయింట్ వెంచర్ ప్రాజెక్టులలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని ప్రైవేటు సంస్థలకు అనుకూలంంగా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ బహిరంగ చర్చకు సిద్ధమేనన్న మంత్రి సవాలును తాను స్వీకరిస్తున్నానని ఎక్కడ, ఎప్పుడు చర్చకు పిలిచినా తాను సిద్ధమేనని ఆయన ప్రకటించారు. అయితే తన ఆరోపణకు బదులివ్వకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని పేర్కొంటూ ఇంద్రకరణ్ రెడ్డి బతుకేమిటో బయటపెడతానని రేవంత్ హెచ్చరించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. హౌసింగ్ బోర్డు కు సంబంధించిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగిందని తాను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తుంటే మంత్రి దానికి బదులివ్వకుండా వ్యక్తిగతమైన ఆరోపణలు చేసూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. "ఇంద్రకరణ్ రెడ్డీ..నోటికొచ్చినట్లు మాట్లాడితే నీ బతుకు బయటపెట్టాల్సివస్తుంది." అని ఆయన హెచ్చరించారు. 1987లో టీడీపీ నిన్ను జడ్పీ చైర్మెన్ చేసింది. 1991లో ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపితే అక్కడ పీవీ నర్సింహారావుకు అమ్ముడుపోయిన చరిత్ర నీది. ఆతరువాత కాంగ్రెస్ లో అయినా సరిగ్గా ఉన్నావా అంటే అదీలేదు. వైఎస్ హయాంలో కోట్లాది రూపాయల కాంట్రాక్టు సంపాదించుకొని ఆ తరువాత ఆ పార్టీకి కూడా పంగనామాలు పెట్టావు. మళ్లీ మాయావతి వద్దకు వెళ్లి బీఎస్పీ టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మాయావతిని కూడా మోసగించి టీఆర్ఎస్లో చేరావు. ఎవరికి తెలియదు నీ చరిత్ర అని రేవంత్ ధ్వజమెత్తారు. ఇన్ని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి మరో కామెంట్ కూడా చేశారు. కేసీఆర్ విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడి కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే బానిసగా బతుకుతున్న ఇంద్రకరణ్ రెడ్డి గురించి మాట్లాడితే తన స్థాయి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలో జరిగే అవినీతికి ఎదురు నిలిచి పోరాడుతున్న తనపై అక్రమంగా ఎన్నో కేసులు బనాయిస్తున్నారని తాను వెళ్లిన ప్రతిచోటా తనపై కేసులను నమోదు చేస్తున్నారని రేవంత్ చెప్పారు. అయితే ఉడత ఊపులకు తాను భయపడేది లేదని, టీఆర్ఎస్ తనపై బనాయించే కేసులు తనకు వెంట్రుకతో సమానమని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అక్రమ కేసులో ఇరుక్కొని జైలుకు పోయి ఉండవచ్చునని అయితే కేసీఆర్ గడీ దగ్గర కాపలా కుక్కలా ఉండే ఇంద్రకరణ్ రెడ్డికి ఉన్నంత నీచమైన చరిత్ర తనకు లేదని పేర్కొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తనను ఒక బచ్చా. అని చేసిన వ్యాఖ్యపై ఆయన స్పందిస్తూ "నేను బచ్చానే కానీ నీలాంటి లుచ్చా కాదు." అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ఆరోపణకు సమాధానం చెప్పాలని మాత్రమే కోరుతున్నానని అలా కాకుండా వ్యక్తిగతంగా తనను తిట్టడానికి సిద్ధపడితే తాను కూడా అందుకు సిద్ధమేనని తెలిపారు. తిట్టుకోవడమే ప్రధానమైతే టీఆర్ఎస్ లోని నాయకులు, కేసీఆర్ కుటుంబీకులందరూ ఒకవైపు ఉంటే తాను ఒక్కడినే మరోవైపు ఉండి తాను వారికి సమాధానం చెప్పగలనని ధీమా వ్యక్తం చేశారు. జేవి పథకంలో జరిగిన అక్రమాలలో తనకు వాటా లేకపోతే సీఎం కేసీఆర్ దానికి సంబంధించిన నివేదికలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/