Begin typing your search above and press return to search.
ఒక్కో ఎమ్మెల్యేకు కోటి ఇచ్చిన కేసీఆర్
By: Tupaki Desk | 25 Aug 2018 12:34 PM GMTసంచలన విమర్శలకు పెట్టింది పేరు - తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడటంలో ముందుండే తెలంగాణ కాంగ్రెస్ నేత - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోమారు కలకలం రేపే కామెంట్లు చేశారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ - శాసనసభా పక్షం - పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ నిర్వహించిన టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశంపై రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన డబ్బాల్లో ఒక్కో ఎమ్మెల్యేకు కేసీఆర్ రూ.కోటి ఇచ్చారని ఆయన ఆరోపించారు. కోటి రూపాయలు ఇచ్చారని కొందరు ఎమ్మెల్యేలే మాతో చెప్పారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒక్కో ఎమ్మెల్యేకు కోటి చొప్పున టీఆర్ ఎస్ భవన్ లో ఒక్కరోజే వంద కోట్లు పంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు పక్కా సమాచారం ఉందని, నిఘా వర్గాలు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నిఘా సంస్థలు తక్షణమే విచారణ జరపాలని కోరారు.
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు అధిష్టానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆరెస్ ..తెలంగాణ బీజేపీ శాఖ అని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధిష్టానం గాలిలో ఉంటే ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కు సహానీ అనే చీకటి స్నేహితుడు ఉన్నాడని ఆరోపించిన రేవంత్ ఢిల్లీలో సహానీ లీలలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ముందస్తు కోసం కేసీఆర్ గూడుపుఠాణి చేస్తున్నారని ఆరోపించారు. `సీఎం చెబుతున్న ఇరవైఐదు లక్షలు మందితో సభ అంతా వట్టిదేనని రేవంత్ పేర్కొన్నారు. ``రెండు లక్షల మంది తో ఇరవైఐదు లక్షలు అని కేసీఆర్ చూపబోతున్నారు. కేసీఆర్ టక్కు టమార విద్యల్లో భాగమే కేసీఆర్ ఇరవైఐదు లక్షల జనాల మాట. ఇరవైఐదు లక్షల మంది రావాలంటే రెండు లక్షల వాహనాలు రావాలి. కేసీఆర్ చెబుతున్న విధంగా సభ జరిగితే నాలుగైదు వందల కోట్లు ఖర్చు అవుతాయి. కేసీఆర్ కు ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? గ్రామాలకు వెళ్లే ముఖం లేక ..హైదరాబాద్ లో సభతో ప్రజలను మభ్యపెడుతున్నారు`` అని ఆరోపించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి ఆసక్తికర సవాల్ విసిరారు. ``సిరిసిల్ల నుండి ఇరవైఐదు వేల మంది వస్తారా కేటీఆర్? ఇందులో నిజం ఎంతో తేలాలంటే...చెక్ పోస్ట్ పెడితే సరిపోతుంది. చెక్ పోస్ట్ దగ్గర ఇరవైఐదు వందల వాహనాలతో వాట్సాప్ లో వివరాలు పెడితే..పరీక్షకు కేటీఆర్ రెడీనా?`` అని సవాల్ విసిరారు. గ్రామసభ పెడితే ప్రజలు టీఆరెస్ నేతల బట్టలూడదీస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ లో కొత్తగా చేరిన వాళ్లకు టికెట్లిస్తే ..పాతవాళ్లు ఓడిస్తారని...ఇప్పుడు ఉన్నోళ్లకు ఇస్తే ప్రజలు ఓడిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. స్థూలంగా టీఆర్ ఎస్ ను ప్రజలు ఓడించండం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.