Begin typing your search above and press return to search.
రేవంత్ ‘చంద్రభక్తి’ :ఆరెస్సెస్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ!
By: Tupaki Desk | 6 March 2018 4:35 PM GMTరాజకీయాల్లో ఎడ్వాంటేజీ ఏంటంటే.. ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుకోవచ్చు. ఎలాంటి కామెంట్లు చేసినా.. వాటికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆరోపణలు చేసినా ... వాటిని నిరూపించాల్సిన అగత్యం లేదు. అందుకే తాజాగా రేవంత్ రెడ్డి కూడా అదే తరహా కామెంట్లతో కొత్త చర్చకు తెరతీస్తున్నారు. కేసీఆర్ భారతీయ జనతా పార్టీ మీద - ప్రత్యేకించి మోడీ సర్కారు మీద ఒక రేంజిలో విరుచుకుపడుతున్న సమయంలో.. ఇదంతా ఆయన భయంతోనే చేస్తున్నారని.. భాజపా ఆరెస్సెస్ చేతిలో కీలుబొమ్మగా మారి మాట్లాడుతున్నారని.. చంద్రబాబు మూడో ఫ్రంట్ ను సమీకరించకుండా.. అడ్డుపుల్ల వేయడానికి ఆ రకంగా కేసీఆర్ ఒక టూల్ లాగా కమల దళానికి ఉపయోగపడుతున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే.. రేవంత్ రెడ్డి తొలినుంచి తోకతొక్కిన తాచు లాగా ఎగిరి బుసలు కొడుతూ ఉంటారు. తాను ఓటుకు నోటు కేసులో అరెస్టు అయినప్పుడు.. పోలీసు వాహనం ఎక్కి.. మీసం మెలేసి.. ‘నీ అంతు చూస్తా’ అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి హెచ్చరించిన రేవంత్ కు బహుశా .. మూడో ఫ్రంట్ పేరుతో కేసీఆర్ దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనం రుచించినట్లు లేదు. అందుకే దీనికి సంబంధించి తనదైన శైలిలో భిన్నమైన భాష్యాలు ఇస్తున్నారు.
ఈ దేశంలో మూడో ఫ్రంట్ ను ఏర్పాటు చేయగలిగే సత్తా ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉన్నదిట. (మరి కేసీఆర్ ఆ మాట ప్రకటించిన వెంటనే మమతా బెనర్జీ - హేమంత్ సోరెన్ - అజిత్ జోగి లాంటి వాళ్లంతా.. ఆయనతో జట్టు కట్టడం గురించి ఏమంటారో?). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నెమ్మదిగా దేశంలోని అన్ని పార్టీల నేతలతో మాట్లాడుతూ మూడో కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఆ సంగతి పసిగట్టిన కమల నాయకులు.. చంద్రబాబు ఆ పని చేయకుండా, చేయనివ్వకుండా... కేసీఆర్ ను రంగంలోకి దించినట్లుగా రేవంత్ రెడ్డి అభివర్ణిస్తున్నారు.
నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న భాజపా మాతృసంస్థ ఆరెస్సెస్ సూచనల మేరకే కేసీఆర్ పనిచేస్తున్నారట. ఇదంతా బాబు మూడో కూటమి ఏర్పాటు చేయకుండా.. పార్టీలను డైవర్ట్ చేయడం - తద్వారా మోడీ సర్కారుకు నిరపాయకరమైన వాతావరణం సృష్టించడం.. ఆ పిమ్మట.. ఎన్నికల సమయంలో.. మోడీ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా.. మోడీ తిరిగి నెగ్గేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పాటు చేయడం కేసీఆర్ లక్ష్యమంట. ఇలా రేవంత్ రకరకాలుగా భాష్యాలు చెబుతున్నారు.
అందుకే పెద్దలు అన్నారు.. ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అని!!