Begin typing your search above and press return to search.

కేసీఆర్ అవార్డుల‌పై డౌట్లు మొద‌ల‌య్యాయి

By:  Tupaki Desk   |   9 Jan 2018 10:35 AM GMT
కేసీఆర్ అవార్డుల‌పై డౌట్లు మొద‌ల‌య్యాయి
X
కొడంగ‌ల్ ఎమ్మెల్యే - కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రేవంత్ రెడ్డి మ‌రోమారు తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ పై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా అందిస్తున్న 24 గంట‌ల విద్యుత్‌ పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. విద్యుత్ కొనుగోలు విషయంలో ప్రభుత్వం అవకతవకలు చేస్తోంద‌ని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లోటు విద్యుత్ నుండి మిగిలి విద్యుత్ వైపు ప్రయనిస్తున్నామ‌ని పేర్కొంటూ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది సాధ్యం అయిందని రేవంత్ చెప్పారు. అయితే కేసీఆర్ హ‌యాంలో అవినీతి జ‌రుగుతోంద‌న్నారు.

విద్యుత్ స‌ర‌ఫ‌రా - ఉత్ప‌త్తి విష‌యంలో మధ్యకాలిక విద్యుత్ ఒప్పందాలలో అత్యంత అవినీతి చోటుచేసుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అన్ని సంస్థలకు రిటైర్ అయిపోయిన వ్యక్తులను - కేసీఆర్ బంధువులను నియమిస్తున్నారని అన్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనే అవకాశం ఉన్నా - బయట ఎక్కువ ధరకు విద్యుత్ ఈ ప్రభుత్వం కొంటుందని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వం,ప్రజలపై అత్యధిక భారం పడుతుందని వెల్ల‌డించారు. ఒక్కో యూనిట్ కి 1.95 పైసలు చొప్పున ఆ 4,910 ఎంఓయూలకు ఈ ప్రభుత్వం 957.45 కోట్లు స్థిర చార్జీలు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు చెల్లించింది. విద్యుత్ కొనకపోయినా ప్రభుత్వం ఈ 957.45 కోట్లు చెల్లించిందని రేవంత్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థల విద్యుత్ ఉత్పత్తి పడిపోయిందని తెలిపారు. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఇచ్చే కమీషన్ల కోసం ప్రభుత్వ విద్యుత్ సంస్థల్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంద‌ని ఆరోపించారు.

పక్క రాష్ట్రం తక్కువ ధరలకు విద్యుత్ ఇస్తామంటే ఎందుకు ఎక్కువదరకు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల దగ్గర కొనుగోలు చేస్తోంద‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీని వెనకాల ఎలాంటి ప్రైవేట్ ఒప్పందాలు ఉన్నాయి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 24 గంటల విద్యుత్ పేరిట రాష్ట్రంలో భారీ కుట్రకు టీఆర్ ఎస్ ప్రభుత్వం తెరలేపింద‌ని ఆరోపించారు. ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా - వీరికి కమిషన్ అందేలా ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నాయని దుయ్య‌బ‌ట్టారు. విద్యుత్ కొనుగోలు కు సంబందించిన అన్ని ఒప్పందాలు - చ‌ర్చ‌ల విష‌యాల‌ను శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలు చేయకుండా రూ.957.45 కోట్లు చెల్లిచిన ఈ ప్రభుత్వం దినికి ఎవరు బాద్యులో చెప్పాలని ఆయ‌న కోరారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో ప్రజలపై భారం పడుతుంద‌ని అన్నారు. విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్‌ రెడ్డి ఒక చెంచా అని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ ఒక మశ్చర్ పైల్వాన్ అని ఎద్దేవా చేశారు.

విద్యుత్ కొనుగోళ్లు - సరఫరాపై జెన్‌ కో చైర్మ‌న్ ప్రభాకర్ రావు అబద్దాలు చెబుతున్నారని...విద్యుత్ కొనుగోళ్లపై ప్రభాకర్ రావుతో చర్చకు కాంగ్రెస్ సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. కేసీఆర్ అడ్డగోలు అవినీతి ఒప్పందాలకు అధికారులు సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాట విననందుకే ఐఏఎస్ లు సురేష్ చంద్ర - అరవింద్ కుమార్ లను తప్పించింది నిజం కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలన్నీ గోల్ మాల్ ఒప్పందాలేన‌ని మండిప‌డ్డారు. విద్యుత్ సరఫరా చూస్తుంటే ..సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్య‌వ‌సాయ పితామ‌హుడు స్వామినాథన్ ప్రశంశలు చెప్పారంటే నమ్మలేమని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో నకిలీ అవార్డులు తీసున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిద‌ని ఎద్దేవా చేశారు.