Begin typing your search above and press return to search.
టైగర్ కు టైమొచ్చింది
By: Tupaki Desk | 28 Jan 2016 9:47 AM GMTటీటీడీపీ అధిపత్య పోరులో కొద్దికాలంగా వెనుకబడిన రేవంత్ రెడ్డి మళ్లీ జోరందుకున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన బాగా స్పీడుగా ఉండి మిగతా నేతల కంటే ముందున్నారు. అంతేకాదు... తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి రేవంత్ రెడ్డే కీలక నేతల అన్నంతగా ఆయన ముద్ర కనిపిస్తోంది. పార్టీ నాయకత్వం నుంచి ఆయనకు బాగా ప్రాధాన్యం దొరుకుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు - ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల వ్యవహారాలు చూస్తున్న లోకేశ్ రేవంత్ కు మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి అని బహిరంగ సభల్లో లోకేశ్ కితాబు ఇవ్వడం ఇది స్పష్టం చేస్తోంది. లోకేశ్ ఇచ్చిన ఊపుతో రేవంత్ కూడా కేసీఆర్-కేటీఆర్ లపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రేవంత్ రెడ్డి సభలకు జన స్పందన బాగా కనిపిస్తోంది.
వాస్తవానికి గత కొద్ది కాలం క్రితం వరకూ రేవంత్ ప్రాధాన్యం తగ్గినట్లు కనిపిం చింది. ఆ సమయంలో పార్టీ నాయకత్వం సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించింది. టిడిఎల్పీ సమావేశం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా దయాకర్ పెత్తనమే సాగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఎన్నికల ముందు నాయకత్వం, మళ్లీ రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నికల ప్రచారం కంటే ముందు జరిగిన అభ్యర్ధుల ఎంపికలో, రేవంత్ కీలక పాత్ర పోషించారు.దీనితో సహజంగానే దయాకర్ రావుకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అభ్యర్ధుల ఎంపికలోనూ ఆయన పాత్ర నామమాత్రంగా మారింది. దీంతో తెలంగాణ టైగర్ కు మళ్లీ టైమొచ్చిందని కార్యకర్తలు అంటున్నారు.