Begin typing your search above and press return to search.

రేవంత్ స‌స్పెండ్‌....మ‌ద్ద‌తు తెలిపిన జానారెడ్డి

By:  Tupaki Desk   |   11 March 2017 6:31 AM GMT
రేవంత్ స‌స్పెండ్‌....మ‌ద్ద‌తు తెలిపిన జానారెడ్డి
X
తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారన్న నెపంతో సభనుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌ రేవంత్‌ రెడ్డి - సండ్ర వెంకటవీరయ్యను స్పీకర్‌ సభ నుంచి సస్పెండ్‌ చేశారు. కాగా, ఇద్దరు టీడీపీ సభ్యులపై సస్పెషన్‌ వేటు వేయ‌డంపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రతిపక్ష నాయకుడు - కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం సస్పెండ్‌ విషయంపై మాట్లాడిన ఆయన సభ సాంప్రదాయాలను - మర్యాదల విషయాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు గత సభల్లో జరిగిన తీరుపట్ల ఆత్మపరీక్ష చేసుకోవాలని సూచించారు.

ఒక నిర్ణయం తీసుకునే ముందు సభలో ఉన్నమిగతా నాయకుల సలహాలు - సూచనలు తీసుకోవాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. చట్టసభలకు హాజరైన సభ్యులను భయబ్రాంతులకు గురిచేసేందుకు, కక్ష సాధింపుగానో చర్యలు తీసుకోవటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. చట్ట సభల నుంచి ప్రతిపక్ష నాయకులను సస్పెండ్‌ చేయడం అంటే ప్రజాసమస్యల గురించి మాట్లాడకకుండా అడ్డుకోవడమేనని మండిపడ్డారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు అసెంబ్లీ స్పీకర్ చ‌ర్య తీసుకునే విష‌యంలో హుంద‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. అనంత‌రం స‌స్పెన్స‌న్‌ ను నిర‌సిస్తూ కాంగ్రెస్ స‌భ్యులు సైతం వాకౌట్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/