Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌ ను ఇర‌కాటంలో పెట్టే స్కెచ్చేసిన కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   25 Jan 2018 12:05 PM GMT
గ‌వ‌ర్న‌ర్‌ ను ఇర‌కాటంలో పెట్టే స్కెచ్చేసిన కాంగ్రెస్‌
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త‌న దూకుడు పెంచిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ విష‌యంలో ఇటీవ‌ల త‌మ అస‌హ‌నాన్ని వెళ్ల‌గ‌క్కిన కాంగ్రెస్ తాజాగా మ‌రో స్కెచ్చు వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో ఫిర్యాదు చేసింది. అయితే ఆషామాషీగా విన‌తి ప‌త్రం ఇవ్వ‌డం కాకుండా..పిటిష‌న్ ఇచ్చింది త‌ద్వారా గ‌వ‌ర్న‌ర్‌ ను ఇర‌కాటంలో ప‌డేసింది. కాంగ్రెస్ పార్టీ శాస‌న‌మండ‌లి నేత షబ్బీర్ ఆలీ - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్‌ కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం వారు గాంధీభ‌వ‌న్‌ లో మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంటరీ సెక్రెటరీగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వారిపై వేటు వేయాలని గవర్నర్ కు పిటిషన్ దాఖలు చేశామ‌న్నారు. గవర్నర్ కు వినతి పత్రం ,ఇవ్వలేదు పిటీషన్ ఇచ్చామని..పిటీషన్ పై గవర్నర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామ‌ని తెలిపారు.

15శాతానికి మించి మంత్రులుగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ విరుద్దంగా కేసీఆర్ ఎమ్మెల్యేలను పార్లమెంట్ సెక్రెటరీలుగా నియమించారని ఆరోపించారు. హైకోర్టు ప్రశ్నించడంతో ఆరుగురిని పార్లమెంట్ సెక్రటరీ లుగా తప్పించింది కానీ వేటు వేయలేదని తెలిపారు. ఇలా చట్ట ఉల్లంఘన చేసిన ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలను రాష్ట్రపతి వేటువేశారని...తెలంగాణలో అదే ఉల్లంఘనకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కేసీఆర్ అమలుచేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ త‌మ పిటిష‌న్‌ను రాష్ట్రపతికి పంపిస్తారని నమ్ముతున్నామ‌న్నారు. ఆ పార్లమెంటరీ సెక్రటరీలపై వేటు వేయడంతో పాటు వారు తీసుకున్న జీత భత్యాలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ కు చట్టం ,ప్రజలు ,న్యాయస్థానాలంటే లెక్కేలేదని ఆరోపించారు. త్వరలోనే మరోసారి రాష్ట్రపతి, సీఈసీలను కలుస్తామ‌ని తెలిపారు.

కేసీఆర్ దొరికిన దొంగ అని రేవంత్ ఆరోపించారు. టీఆర్ ఎస్ తప్పుంది కాబట్టే గులాబీ కూల‌, పార్లమెంటరీ సెక్రటరీలపై స్పందించడం లేదని అన్నారు. గులాబీ కూలీపై ప్రధాని ఆఫీస్ అడిగినా ...రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని అన్నారు. గులాబీ కూలీ పై తేలుకుట్టిన దొంగలుగా టీఆర్ ఎస్ నేతలు సైలెంట్ గా ఉన్నారని ఆరోపించారు. గులాబీ కూలీ పేరుతో టీఆర్ ఎస్ నేతలు కోట్ల దోపిడీ చేశారని పేర్కొంటూ టీఆర్ ఎస్‌ పార్టీ గుర్తింపు రద్దు చేసేదాకా గులాబీ కూలీ పై పోరాడుతాన‌ని ప్ర‌క‌టించారు.