Begin typing your search above and press return to search.
ఏపీలో ఎవరు గెలుస్తారంటే రేవంత్ ఆన్సర్ ఇది!
By: Tupaki Desk | 21 March 2019 4:40 AM GMTఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్న వారికి రాజకీయం తెలీదంటే ఎలా ఉంటుంది? తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ సమాధానం అలానే ఉంది. ఏపీ రాజకీయం గురించి తాజాగా ఆయన చెప్పిన మాటలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలుఎంత హోరాహోరీగా సాగుతున్నాయన్నది తెలిసిందే.
ఏపీ ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకునేందుకు అధికార.. విపక్ష పార్టీల మధ్య సాగుతున్న పోరు అంతా ఇంతా కాదు. ఏపీ ఫలితాలపై తెలంగాణలో భారీఉత్కంట నెలకొంది. రాజకీయ వర్గాలే కాదు.. సామాన్యులు సైతం ఎంతో ఆసక్తిగా ఏపీ ఎన్నికల్ని గమనిస్తున్నారు. ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు.
చివరకు ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉందో లేదో కూడా తెలియని జాతీయ మీడియా సంస్థలు సైతం సర్వేల పేరుతో ఫలితాలు వెలువరిస్తున్నాయి. ఇలాంటివేళ.. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న రేవంత్ రెడ్డిని ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నను అడిగితే.. ఊహించని రీతిలో సమాధానమిచ్చారు.
తాజాగా మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలిచిన ఆయన.. ఏపీలో ఎవరు గెలుస్తారన్న విషయాన్ని తాను చెప్పలేనని చెప్పారు. ఏపీ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని.. పక్క రాష్ట్ర రాజకీయాల గురించి తనకు తెల్వదంటూ చెప్పిన మాటలు అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. మొత్తానికి ఏపీ ఎన్నికల ఫలితాల గురించి తాను మాట్లాడే మాటలు తనకు ఎలాంటి ఇబ్బందిని తెచ్చి పెడతాయన్న ఉద్దేశంతోనే రేవంత్ రియాక్ట్ కాలేదంటున్నారు.