Begin typing your search above and press return to search.
అసెంబ్లీకి రేవంత్ ఎలా వచ్చారంటే..!
By: Tupaki Desk | 27 Oct 2017 9:14 AM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సర్వం సిద్ధం చేసుకున్న మాట బలంగా వినిపిస్తోంది.
రేవంత్ తీరుపై ఆగ్రహంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికే ఆయనకున్న పదవుల్ని పీకేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా.. టీటీడీపీ ఎల్పీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు. రేవంత్ అనుసరిస్తున్న వైఖరిపై ఈ రోజు టీడీపీ అధినేత నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలాఉంటే.. ఈ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రేవంత్ హాజరయ్యారు.
సాధారణంగా అసెంబ్లీ సమావేశాలంటే పలువురు పార్టీ నేతలు.. టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశాలకు హాజరయ్యే వారు. పార్టీలో జంపింగ్స్ చోటు చేసుకున్న తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలప్పుడు రేవంత్ వెంట తెలుగు తమ్ముళ్లు వెంట ఉండేవారు. ఇక.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మెడలో పసుపు కండువా వేసుకోని కాసింత హడావుడి చేసే వారు.
ఈ రోజు అసెంబ్లీకి వైట్ షర్ట్ వేసుకున్న ఆయన మెడలో పార్టీ కండువా వేసుకోకుండా వచ్చారు. కారు దిగి ఒక్కడే హాజరైన రేవంత్ రెడ్డ.. సభలోకి ఒక్కడే వెళ్లటం గమనార్మం. నిన్నమొన్నటివరకూ రేవంత్ అసెంబ్లీకి వచ్చారంటే హడావుడికి భిన్నంగా ఒక్కడిగా ఉన్న ఆయన.. తనకు అభివాదం చేసే వారికి బదులు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. మరోవైపు రేవంత్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలా? అన్న అంశంపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోతోంది.