Begin typing your search above and press return to search.
రేవంత్ లెక్కతో కేసీఆర్ కు చిరాకే..
By: Tupaki Desk | 4 Feb 2017 6:53 AM GMTఉన్నది ఉన్నట్లుగా చెబితే ఎవరికైనా కోపమే. మిగిలిన వారి మాటలకు.. తెలంగాణ తెలుగుదేం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి మాటలు కాస్త వేరుగా ఉంటాయి. కేసీఆర్ మాదిరి మసాలా దట్టించేలా మాట్లాడటంతో పాటు.. మంత్ర హరీశ్ రావు మాదిరి గణాంకాల్ని ఉటంకిస్తూ.. తన వాదనను సమర్థవంతంగా వినిపించటంలో రేవంత్ కు మంచి పట్టు ఉందని చెప్పక తప్పదు. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా స్టార్ట్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కొత్త లెక్కల్ని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.
మల్లన్నసాగర్ జలాశయం నీటి సామర్థ్యాన్ని 50 టీఎంసీల నుంచి 30 టీఎంసీలకు తగ్గిస్తే మంచిదని చెబుతున్నారు. అదే పని చేస్తే దాదాపు 10వేల ఎకరాలు మునిగిపోకుండా చూడొచ్చని చెబుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని తగ్గించటం తప్పేమీ కాదన్న విషయాన్ని చెప్పేందుకు కేసీఆర్ తీసుకున్న మరో నిర్ణయాన్ని ప్రస్తావిస్తున్నారు. కొండపోచమ్మజలాశయ నిల్వ సామర్థ్యాన్ని 21 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మల్లన్నసాగర్ జలాశయం నీటి నిల్వ సామర్థ్యాన్ని 20 టీఎంసీలు తగ్గించి.. కొండపోచమ్మ జలాశయాన్ని 21 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తే పేదలకు చెందిన భూములు మునిగిపోకుండా ఉంటాయన్నది రేవంత్ వాదన.
ఆయన వాదనకు ఓకే అంటే.. కొండపోచమ్మ జలాశయ నిల్వ సామర్థ్యాన్ని తగ్గించాలని భావిస్తున్న టీఆర్ ఎస్ ఆలోచన సాధ్యం కాదు. ఇంతకీ కొండ పోచమ్మ జలాశయ నీటి సామర్థ్యాన్ని కేసీఆర్ సర్కారు ఎందుకు తగ్గించాలో చెబుతున్న రేవంత్... ఆసక్తికర వాదనను వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి బంధువుల భూములు పెద్ద ఎత్తున మునిగిపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
తాను చెప్పినట్లుగా మల్లన్నసాగర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తే ప్రభుత్వం మీద ఆర్థిక భారం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్కో టీఎంసీకి సగటున రూ.144కోట్లు వ్యయం అవుతుంటే.. కొండపోచమ్మ జలాశయం నిర్మాణానికి ఒక్కో టీఎంసీకి రూ.74 కోట్లు మాత్రమే ఖర్చు కానున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేలా చెబుతున్న రేవంత్ లెక్కలు కేసీఆర్ కు చిరాకు పుట్టించటం ఖాయమని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/