Begin typing your search above and press return to search.
దమ్ముంటే నాపై కేసు పెట్టు కేసీఆర్ : రేవంత్
By: Tupaki Desk | 29 Jun 2017 3:55 PM GMTతన మెడకు చుట్టుకున్న సీబీఐ కేసుల కారణంగానే సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ ముందు మోకరిల్లుతూ తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని టిటిడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం అయ్యాక కూడా 4 సార్లు కేసీఆర్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించడం జరిగిందని వెల్లడించారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్న సీఎం కేసీఆర్ కారణంగానే పొలం బాట పట్టాల్సిన రైతులు బ్యాంకుల బాట పట్టారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ సీఎం కేసీఆర్ పై పలు సంచలన ఆరోపణలు చేశారు. 2011లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎలుగుబంటి సూర్యనారాయణ ఈఎస్ఐ ఆసుపత్రుల కుంభకోణంలోనూ, సహారా ఇండియాకు చెందిన ప్రావిడెంట్ఫండ్ కుంభకోణంలోనూ కేసీఆర్ పాత్ర ఉందని సీబీఐ ఆయనపై కేసులు నమోదు చేసిందని ఆ కేసులు ఆయనపై ఇప్పటికీ నడుస్తున్నాయని రేవంత్ తెలిపారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత కూడా సీబీఐ మద్రాస్ కార్యాలయం నుంచి 20 మందికి పైగా సీబీఐ అధికారుల బృందం నాలుగు సార్లు హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను విచారించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే, ఈ వార్తలు మీడియాలో రాకుండా సీఎం జాగ్రత్తలు తీసుకన్నారని తెలిపారు. ఈ కేసుల కారణంగానే మోడీ పేరు వింటే కేసీఆర్ మోకాళ్లు వణుకుతున్నాయని ఆయన వ్యాఖ్యనించారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోని సీఎంల కంటే ముందుగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలను ఆదరాబాదరగా ఆమోదిస్తూ కేంద్రం ముందు కేసీఆర్ మోకరిల్లుతున్నారని రేవంత్ ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించే సీఎం కేసీఆర్‌కు దమ్మంటే తాము చెబుతున్న విషయాలు అబద్దమని తనపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు.
ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కేసీఆర్ అదే తరుణంలో షరతులతో కూడిన మద్దతును ఇచ్చి ఉండవచ్చునని అలా కాకుండా బేషరతుగా మద్దతు ఇవ్వడంలో అంతర్యం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలోనే మకాం వేసిన కేసీఆర్, కేటీఆర్లు రాష్ట్రంలో సమస్యలను గురించి కేంద్రాన్ని ప్రశ్నించలేదని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రధాని వద్ద పట్టుపడతామని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. డీలిమిటేషన్ వల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కేవలం కేసీఆర్ ఇతర పార్టీల నుంచి తెచ్చి చేర్చుకున్న నాయకులకు మాత్రమే మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలపై కేసీఆర్‌కు ఏ మాత్రం అభిమానం ఉన్నా జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి జరుగుతున్న రూ.3000 కోట్ల నష్టాన్ని అదనపు భారాన్ని కేంద్రమే భరించాలని షరతుపెట్టాలని సూచించారు. జీఎస్టీ అమలు కోసం జూన్ 30న జరిగే ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరించాలని, ఒక వేళ హాజరైనా తెలంగాణ తరఫున నిరసన తెలపాలని రేవంత్ కోరారు. జీఎస్టీ విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో, మోడీ పక్షాన నిలబడి రాష్ట్ర ప్రజలపై భారం వేస్తారో నిర్ణయించుకోవాలని రేవంత్ పేర్కొన్నారు.
నోట్ల రద్దు విషయంలో కూడా కేసీఆర్ ప్రధాని మోడీ నిర్ణయానికి పూర్తి మద్దతును తెలిపారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా నల్ల ధనం బయటికి వస్తుందని దానిని పేదలకు పంచుతారని చెప్పడంతో పాటు, ఈ విషయంలో ఒక్క మాట కూడా ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అసెంబ్లీలో నోట్ల రద్దుకు మద్దతు ఇస్తూ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపారని రేవంత్ గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విస్తారంగా వరాలు కురిసినా రైతులు పొలాలలో కాకుండా బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారని తెలిపారు. రైతులు విక్రయించిన వ్యవసాయ ఉత్పత్తుల తాలుకు రూ. 8500 కోట్లు, రైతులకు రుణంగా ప్రకటించిన రూ.23 వేల కోట్ల రైతుల చేతుల్లో ఉండాలని అయితే, పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని చెప్పారు. బ్యాంకులలో నగదు నిల్వలు లేవని, రైతులకు ఇవ్వడానికి, వ్యవసాయ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, దీంతో రైతులు, రైతు కూలీలు వ్యవసాయ పనులను విడిచిపెట్టి పగలు, రాత్రి బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందన్నారు. ఇతర రాష్ర్టాల్లో రైతులకు ఎలాంటి నగదు కష్టాలు లేవని అయితే తెలంగాణలో మాత్రం కేవలం సీఎం వైఫల్యం కారణంగానే ఈ ఇబ్బందులు తలెత్తాయని ఆయన ఆరోపించారు. 10 రోజులుగా ఢిల్లీలో మాకం వేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నగదు కష్టాలను గురించి ప్రధాన మంత్రితో గాని, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్‌తో గాని ఎందుకు కలవలేదని నిలదీశారు. నోట్ల రద్దు సమయంలోనే అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఈ కష్టాలను గురించి తాము ముందుగానే హెచ్చరించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఏర్పడిన ఈ నగదు కొరత కారణంగా వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తక్షణం ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని, రాష్ట్రానికి అవసరమైన నగదు నిల్వలను రప్పించి బ్యాంకులలోనే కాకుండా అవసరమైతే పంచాయితీ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తుతో రైతులకు నగదును పంపిణీ చేయాలని సూచించారు. ఈ సమస్యలను పరిష్కరించిన తరువాతే కేసీఆర్ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/